బోయ‌పాటిని దూరం పెట్టేశారా..?

ఈ సంక్రాంతికి విడుద‌లైన సినిమాల్లో… విన‌య విధేయ రామ ఒక‌టి. టాక్ ప‌రిస్థితి ఎలా ఉన్నా… వ‌సూళ్లు బాగానే ఉన్నాయి. సినిమా రిజ‌ల్ట్‌తో పోల్చి చూస్తే.. ఈ మాత్రం వ‌సూళ్లు రావ‌డం గొప్పే. కాక‌పోతే.. ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను అనేక విమ‌ర్శ‌ల్ని, వ్యంగ్య బాణాల్ని ఎదుర్కోవాల్సివ‌చ్చింది. ఈమ‌ధ్య కాలంలో ఈ సినిమాకి జ‌రిగినంత ట్రోలింగ్ ఏ సినిమాకీ జ‌ర‌గ‌లేదు. యాక్ష‌న్ సీన్లు చూసి న‌వ్వుకోవ‌డం, ఎమోష‌న్ సీన్లు కామెడీగా మార‌డం కూడా విన‌య‌విధేయ రామ‌తోనే జ‌రిగింది. దీనికి పూర్తి బాధ్యుడు బోయ‌పాటి శ్రీ‌నునే. చ‌ర‌ణ్ సినిమా అన‌గానే విప‌రీత‌మైన జోక్యం చేసుకునే చిరంజీవి కూడా బోయ‌పాటిపై న‌మ్మ‌కంతో.. ఈసినిమా విష‌యంలో స్వేచ్ఛ ఇచ్చాడు. ఆఖ‌రికి ఫైన‌ల్ కాపీ చూడ‌కుండానే.. సినిమాని బ‌య‌ట‌కు వ‌దిలేశాడు.

కానీ.. బోయ‌పాటి ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోలేదు. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో సినిమా తీసి అస‌లుకే ఎస‌రు తెచ్చాడు. సినిమా విడుద‌ల‌య్యాక‌… క‌నీసం చిరు నుంచి గానీ, చ‌ర‌ణ్ నుంచి గానీ బోయ‌పాటికి ఒక్క ఫోన్ కాల్ కూడా వెళ్ల‌లేదంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. మెగా ఫ్యామిలీ సినిమాలంటే చిరు కోసం ప్ర‌త్యేకంగా ఓ షో వేస్తారు. సినిమా చూసి మీడియాతో త‌న అభిప్రాయం పంచుకుంటాడు చిరు. విన‌య విధేయ రామ‌కి అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. సినిమా ఫ‌లితం ఎలాఉన్నా.. రెండో రోజో, మూడో రోజో స‌క్సెస్ మీట్ పెట్ట‌డం ఆన‌వాయితీగా మారింది. కానీ.. విన‌య విధేయ దానికీ నోచుకోలేదు. చిరు, చ‌ర‌ణ్ బోయ‌పాటిని పూర్తిగా దూరం పెట్టేశార‌ని, ఒకవేళ స‌క్సెస్ మీట్ పెట్టినా చ‌ర‌ణ్ డుమ్మా కొట్ట‌డం ఖాయం కాబ‌ట్టి… అలాంటి ప్ర‌య‌త్నాలేం చేయ‌డం లేద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close