గుండుతో చిరు ప్ర‌యోగం

ఈ లాక్ డౌన్ వేళ‌… హీరోలంతా త‌మ లుక్కుల‌పై ర‌క‌ర‌కాల ప్రయ‌త్నాలు, ప్ర‌యోగాలూ చేశారు. చేస్తున్నారు. వాటిలో…. అల్టిమేట్ అన‌ద‌గ్గ లుక్ వ‌చ్చేసింది. చిరంజీవి రూపంలో. ఎప్పుడూ లేనిది… చిరు గుండుతో ద‌ర్శ‌న‌మిచ్చారు. దాంతో… ఆయ‌న ఫ్యాన్స్ షాక్ తిన్నారు. చిరు ఏంటి? గుండేంటి? ఇది నిజ‌మేనా, మార్ఫింగా? అని ఆశ్చ‌ర్య‌పోయారు. అది నిజం లుక్కే. చిరు.. త‌న సోష‌ల్ మీడియాలో సైతం ఈ లుక్ ని అభిమానుల‌తో పంచుకున్నారు. ఇది ఓ సినిమాకి సంబంధించిన ట్రైల్ లుక్ అని చిరు పీఆర్ స్ప‌ష్టం చేసింది. ఈమ‌ధ్య చిరు చాలా క‌థ‌లు విన్నారు. అందులో భాగంగా.. చిరు మైండ్ లో ర‌క‌ర‌కాల క‌థ‌లు, లుక్ లూ తిరుగుతున్నాయి. `ఆచార్య‌` షూటింగ్ కి ఇంకాస్త టైమ్ ఉండ‌డంతో… చిరు ఈ లుక్ ట్రై చేశారు. చిరు – బాబి కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతోంది. క‌థా చ‌ర్చ‌లూ జ‌రిగాయి. బాబి ఇటీవ‌ల చిరుకి లైన్ కూడా వినిపించి లుక్ గురించి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే చిరు ఈ లుక్ ట్రై చేశార‌ని స‌మాచారం. చిరు ఈ లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చినా, లేక‌పోయినా… చిరుని ఇలాంటి కొత్త లుక్ లో చూడ‌డం మాత్రం ఫ్యాన్స్‌కి థ్రిల్ ఇస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

తుపాను బాధితులకు జగన్ ఊహించనంత సాయం..!?

నివర్ తుపాన్ కారణంగా కోస్తా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో సర్వం కోల్పోయిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం తుపాను...

HOT NEWS

[X] Close
[X] Close