అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ ఈరోజు తెల్లవారుఝామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె తన కళ్లని ఇది వరకే చిరంజీవి ఐ బ్లాంక్ కి డొనేట్ చేశారు. మరణానంతరం డొనేషన్ పనులన్నీ చిరంజీవి స్వయంగా చూసుకొన్నారు. తెల్లవారుఝామున రెండున్నర గంటలకు కనకరత్నమ్మకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి.. చిరంజీవి అప్పటికప్పుడు బయల్దేరారు. అప్పటికే ఆమె కన్నుమూశారు. ఆ సమయంలోనే ఆయనకు ఐ డొనేషన్ సంగతి గుర్తొచ్చింది. అర్థరాత్రి బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేసి అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలెట్టారు. అల్లు అరవింద్ అనుమతి తీసుకొని ఆ నేత్రదాన ఘట్టం దిగ్విజయంగా పూర్తి చేశారు చిరంజీవి.
ఇది వరకే నేత్రదానం గురించి తన ఇంట్లో, తన సమక్షంలోనే చర్చ నడిచిందని, ‘చనిపోయాక కళ్లు ఏం చేసుకొంటాం. మరొకరికి ఇవ్వడం మంచిదే కదా’ అని అత్తమ్మ తనతో అన్నారని, అంగీకార పత్రం మీద సంతకం చేయలేకపోయినా, ఆమె మాటే అంగీకారంగా భావించి, అత్తమ్మ చనిపోయిన తరవాత, అప్పటి కప్పుడు నేత్రదాన కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేశామని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కనకరత్నమ్మ చనిపోయే సమయానికి తనయుడు అరవింద్ హైదరాబాద్ లో లేరు. ఆయన బెంగళూరు నుంచి హుటాహుటిన బయలుదేరారు. ఐ డొనేషన్ జరిగినప్పుడు అరవింద్ అంగీకారం అవసరం అయ్యింది. ఫోన్లోనే అరవింద్ తన అంగీకారాన్ని తెలియజేశారని చిరంజీవి