పార్ట్ 2 లేదా పుష్పా?

పార్టీ లేదా పుష్పా….. పుష్ప ట్రైల‌ర్‌లో ఫ‌హ‌ద్ ఫాజిల్ చెప్పిన ఈ డైలాగ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఈ డైలాగ్ ని ర‌క‌ర‌కాలుగా మీమ‌ర్స్ వాడుకుంటున్నారు. పుష్ప విడుద‌లయ్యాక‌… పార్టీ లేదా పుష్పా కాస్తా.. పార్ట్ 2 లేదా పుష్పా గా మారిపోయింది.

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న పుష్ప భారీ అంచ‌నాల‌తో విడుద‌లైంది. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్ట్ 1 అంచ‌నాల‌ను అందుకోక‌పోవ‌డంతో.. పార్ట్ 2 ఉందా, లేదా అంటూ… కౌంట‌ర్లు వేస్తున్నారు అభిమానులు. ప్ర‌స్తుతం `పార్ట్ 2 లేదా పుష్పా` అనే కౌంట‌ర్ ట్రెండింగ్ లో ఉంది. పార్ట్ 1 కి నెగిటీవ్ టాక్ రావ‌డం క‌చ్చితంగా పార్ట్ 2పై ఒత్తిడిని పెంచే సంగ‌తే. నిజానికి పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కొంత మాత్ర‌మే అయ్యింది. చాలా బాకీ ఉంది. దాంతో పార్ట్ 2 ఉంటుందా, లేదా? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. బ‌న్నీ కోసం బోయ‌పాటి శ్రీ‌ను రెడీ గా ఉన్నాడు. త‌న‌కు బ‌న్నీ కాల్షీట్లు ఇస్తే.. పార్ట్ 2 ఆల‌స్య‌మ‌వుతుంది. పార్ట్ 1కి ఉన్న క్రేజ్ పార్ట్ 2కి ఉండ‌దు కాబ‌ట్టి.. ఆ సినిమా మీమాంశ‌లో ప‌డుతుంది.

కానీ.. బన్నీ ఆలోచ‌న‌లు వేరుగా ఉన్నాయి. పార్ట్ 2కి అంత స‌మ‌యం ఇవ్వ‌కుండా.. వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. సుకుమార్‌కి ఓ టార్గెట్ ఇచ్చి, ఆ స‌మ‌యంలోగా షూటింగ్ పూర్తి చేయించాల‌ని అనుకుంటున్నాడు బ‌న్నీ. పుష్ప ఈనెల 17న విడుద‌ల అయ్యిందంటే… సుక్కుని ఇలా ప‌రుగులు పెట్టించ‌డ‌మే కార‌ణం. పుష్ప పార్ట్ 2 ఉంటుంది. కాక‌పోతే… సుక్కు చేతిలోనే టైమ్ లేదు. త‌న స్వ‌భావానికి విరుద్ధంగా ఈ సినిమాని చ‌క చ‌క పూర్తి చేయాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close