ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇండియాలో ప్రారంభించిన గోట్ టూర్ కోల్ కతాలో గందరగోళంగా ముగిసింది. ఉదయం కోల్ కతా సాల్ట్ లేక్ సిటీలో మ్యాచ్ ఆడి ఆ తర్వాత ఆయన హైదరాబాద్ రావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మెస్సీ కోల్ కతా వచ్చాడు. సహజంగానే ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండే కోల్‌కతా మెస్సీ కోసం ఎంతగానే ఎదురు చూసింది. సాల్ట్‌లేక్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. అయితే మెస్సీ స్టేడియంకు రాగానే ఆయనకు వీఐపీల తాకిడి పెరిగిపోయింది.
రాజకీయ నేతలు, అధికారులు మెస్సీతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో గందరగోళం ఏర్పడింది. గ్రౌండ్ లోకి వచ్చినా మ్యాచ్ ఆడలేదు. కేవలం పది నిమిషాల్లో ఇక కంట్రోల్ చేయడం కష్టమని చెప్పి ఆయన సిబ్బంది ఆయనను స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు. దీంతో ఫ్యాన్స్ లో కోపం కట్టలు తెంచుకుంది. కనీసం చూసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో వారంతా స్టేడియంలోకి దిగిపోయారు. స్టేడియం ఇన్ ఫ్రాను ధ్వంసం చేయడం ప్రారంభించారు. పోలీసులు, సిబ్బంది కూడా కంట్రోల్ చేయలేకపోయారు.
దీంతో మెస్సీ టూర్ అట్టర్ ఫ్లాప్ గా మారింది. ఈ ఘటనపై మెస్సీకి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. ఫ్యాన్స్ కు కూడా క్షమాపణలు చెప్పారు. విచారణకు ఓ కమిటీని నియమించారు. కోల్ కతా ఘటన నేపధ్యంలో హైదరాబాద్ నిర్వాహకులు అప్రమత్తం అయ్యారు. వీఐపీలను సైతం నియంత్రించి.. మ్యాచ్ ను జరిగేలా చూడాలని అనుకుంటున్నారు. గందరగోళానికి తావు లేకుండా చేయాలనుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్ జరుగుతుంది.
