దేశంలోని మెట్రో సిటీల్లో ఇళ్ల అమ్మకాలు దారుణంగా పడిపోతున్నాయి. బెంగళూరులో రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ ప్రస్తుతం స్తబ్దత కనిపిస్తోంది. ఇళ్ల అమ్మకాల్లో పదిహేను శాతం తగ్గుదల నమోదయిందని రిపోర్టులు చెబుతున్నాయి. అమ్మకాల తగ్గుదల ఇప్పుడు అధిక ధరలు కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తున్నట్లు సూచిస్తుంది. బెంగళూరులో అమ్ముడుపోని ఇన్వెంటరీ (అమ్మకానికి ఉన్న ఫ్లాట్లు) కూడా తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది డిమాండ్లో తాత్కాలిక మందగమనాన్ని సూచిస్తోందని భావిస్తున్నారు.
దిల్లీ/NCRలో ఇళ్ల అమ్మకాలు 23 శాతం పడిపోయింది. ఈ ప్రాంతంలో 2024 చివరి త్రైమాసికంలో ఇళ్ల ధరలు 31 శాతం పెరిగాయ. ఇది కొనుగోలుదారులను ఆకర్షించడంలో అడ్డంకిగా మారింది. లగ్జరీ ప్లాట్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి కానీ కానీ సాధారణ ఫ్లాట్ల అమ్మకాలు తగ్గాయి. నోయిడా వంటి ప్రాంతాల్లో ధరలు 128 శాతం పెరిగాయి. ఇది సామాన్య కొనుగోలుదారులకు భారంగా మారింది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో ఇళ్ల ధరలు 2024లో 3 శాతం మాత్రమే పెరిగాయి, ఇది ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ. అయినప్పటికీ, అమ్మకాలు 15 శాతం తగ్గాయి. ముంబైలో లగ్జరీ ఇళ్లకు (రూ. 4 కోట్లకు పైగా) డిమాండ్ ఉంది, కానీ సాధారణ ఫ్లాట్లకు డిమాండ్ తగ్గింది, ముఖ్యంగా రూ. 40 లక్షల లోపు ఉన్న ఇళ్లు 18 శాతం తగ్గాయని అనరాక్ నివేదిక వెల్లడించింది.
ఇళ్ల ధరలు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్లలో దాదాపుగా రెట్టింపు అయ్యాయి. సరసమైన గృహాల (రూ. 40 లక్షల లోపు) అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. కొనుగోలుదారులు అధిక ధరల కారణంగా “వేచి చూద్దాం” అనే వైఖరిని అవలంబిస్తున్నారు, ఇది అమ్మకాల తగ్గుదలకు దారితీస్తోంది.