రివ్యూ: మైఖేల్

Michael Telugu Movie Review

రేటింగ్‌: 2.25/5

డార్క్ సినిమాలకి లిమిటెడ్ ఆడియన్స్ వుంటారనే అభిప్రాయం వుండేది. అయితే ఆ అభిప్రాయాన్ని కేజీఎఫ్, విక్రమ్ లాంటి సినిమాలు మార్చాయి. పాన్ ఇండియా విజయాలు అందుకున్నాయి. దీంతో డార్క్ సినిమాలకి మళ్ళీ మంచి రోజులొచ్చాయి. సరిగ్గా ప్రజంట్ చేయగలిగితే అన్ని వర్గాల్లో ఆదరణ ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకంతోనే సందీప్ కిషన్ ‘మైఖేల్’ తో వచ్చాడు. ట్రైలర్ చూడగానే ఇది డార్క్ సినిమాని అర్ధమైయింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, గౌతం మీనన్ లాంటి తారాగణం సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచాయి. సందీప్ కిషన్ కెరీర్ లో ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేసిన సినిమా ఇది. మార్కెట్ ని దాటి ఖర్చు చేశామంటే మైఖేల్ కంటెంట్ పై వున్న నమ్మకం అలాంటిదని చెప్పుకొచ్చారు నిర్మాతలు. మరి అంత బలంగా నమ్మిన మైఖేల్ క‌థేమిటి ఏమిటి? సందీప్ తొలి పాన్ ఇండియా మూవీ గా వచ్చిన మైఖేల్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? పాన్ ఇండియాని ఆకట్టుకునే కంటెంట్ మైఖేల్ లో ఉందా?

గురునాథ్ అలియాస్ గురు (గౌతమ్ వాసుదేవ్ మీనన్) పెద్ద గ్యాంగ్ స్టర్. ఒకసారి గురు పై ఎవరో దాడి చేస్తుండగా పదేళ్ళ పిల్లాడైన మైఖేల్ (సందీప్ కిషన్) కాపాడుతాడు. దీంతో గురు తన గ్యాంగ్ లో ఒకరికి మైఖేల్ ని చూసుకునే బాధ్య‌త అప్పగిస్తాడు. గురు గ్యాంగ్ సభ్యులతోనే పెరుగుతాడు మైఖేల్. పెద్దయ్యాక మైఖేల్ కి కీలక బాధ్య‌తలు అప్పగిస్తాడు గురు. అమర్‌నాథ్ (వరుణ్ సందేశ్) గురు కొడుకు. తండ్రితో పాటు దందా చేస్తుంటాడు. అయితే అమర్ పై గురుకి అంత గురి వుండదు. కీలకమైన పనులన్నీ మైఖేల్ కి అప్పగిస్తుంటాడు. ఓ రోజు గురునాథ్ పై దాడి జరుగుతుంది. దాడి చేసింది ఢిల్లీలో వున్న రత్నాకర్ ( అనీష్ కురివిల్లా)అని తెలుస్తుంది. రత్నాకర్ కూతురు తీర(దివ్యాంశ కౌశిక్). తండ్రికూతుళ్ళని చంపే పని మైఖేల్ కి అప్పగిస్తాడు గురు. తర్వాత ఏం జరిగింది ? మైఖేల్ తీర ని కలిశాడా ? అసలు మైఖేల్ గతం ఏమిటి ? తన లక్ష్యం ఏమిటి ? అనేది మిగతా కథ.

ఒక సినిమాని చూసి స్ఫూర్తి పొందడానికి, అనుకరించడానికి చాలా తేడా వుంది. ఇది ఒక గ్యాంగ్ స్టర్ కథ. ఈ మధ్య కాలంలో వచ్చిన గ్యాంగ్ స్టర్ కథ అంటే కేజీఎఫ్ నే అందరికీ గుర్తొస్తుంది. ఆ సీన్లు, ఎలివేషన్లు, ఎడిటింగ్ ప్యాట్రన్ ఇంకా ప్రేక్షకుల కళ్ళముందే వున్నాయి. ఇలాంటి సమయంలో కేజీఎఫ్ ని అనుకరిస్తూ ‘మైఖేల్’ సినిమా చేయాలనే ఉద్దేశం మైఖేల్ రూపకర్తలలో వుందని ఆరంభంలో స్పష్టంగా అర్ధమైయింది. తల్లి మాట వింటున్న కొడుకు, సముద్రం, చేతిలో ఒక బ్యాగ్, కేజీఎఫ్ లాంటి నేప‌థ్య‌ సంగీతం, వాయిస్ ఓవ‌ర్‌తో పాత్ర‌లు ప‌రిచ‌యం కావ‌డం.. ఇవన్నీ కేజీఎఫ్ ని గుర్తు చేస్తాయి. అయితే ఆ పిచ్ ని అలా కంటిన్యూ చేసినా బావుండేది.. కానీ అలా జరగలేదు. నాలుగో శ్రుతిలో చేసిన పాట సడన్ గా ఒకటికి మార్చేసినట్లు.. మైఖేల్ గ్రాఫ్ ఒక్కసారిగా కిందకి పడిపోతుంది. మ‌ధ్య‌లో కేజీఎఫ్ గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా.. ఆ పేట్ర‌న్ ఎడిటింగ్, మేకింగ్ తో.. మ‌ళ్లీ విరుచుకుప‌డుతుంటాడు ద‌ర్శ‌కుడు.

మైఖేల్ ఢిల్లీకి షిఫ్ట్ అయిన తర్వాత నడిచే కథ, వచ్చే సీన్లు మరీ నీరసంగా వుంటాయి. ఎలివేషన్ లో కేజీఎఫ్ ని ఫాలో అయ్యారు కానీ కథని నడిపించడంలో కాలేదు. కేజీఎఫ్ లో కథానాయకుడి లక్ష్యం ‘దునియా’ని గుప్పెట్లో పెట్టుకోవాలని. రాజ్యాన్ని నడిపించాలని. మొదటి సీన్ తోనే అది అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చెప్తారు. మైఖేల్ విషయానికి వస్తే.. అసలు అతడి లక్ష్యం ఏమిటో, దేని కోసం ప్రయాణం చేస్తున్నాడో సరిగ్గా కన్వే చేయలేదు. చివ‌రి వ‌ర‌కూ దాన్ని గోప్యంగానే ఉంచారు. దాంతో అతడు నడుస్తున్న దారి ఎదో నడకలానే వుంటుంది తప్పితే అదొక రసవత్తరమైన ప్రయాణమననే భావన ప్రేక్షకుడిలో కలగదు. బలహీనమైన కథ ఇది. పాయింట్ లో కొత్తదనం లేదు. చెప్పే విధానం కూడా పాత గానే వుంటుంది. ఎంత సేపు దర్శకుడికి మేకింగ్ పైనే ద్రుష్టి వుంది కానీ .. అసలు మైఖేల్ తో ప్రేక్షకుడి ఎందుకు కనెక్ట్ కావాలని అలోచించలేదు.

గ్యాంగ్ స్టర్ వార్ లో ఓ ప్రేమ కథ చెప్పాలనేది దర్శకుడి ఆలోచన కావచ్చు. కానీ ఆ ప్రేమకథలో కొత్తదనం లేకపోగా క్లారిటీ కూడా వుండదు. అసలు మైఖేల్ అంత రియాక్ట్‌ కావడానికి సరైన కారణం కనిపించదు. మైఖేల్ లక్ష్యం వేరే చోట వున్నప్పుడు ప్రేమ కోసం అతడు పడే శ్రమ అంతా వృధా ప్రయాస అనిపిస్తుంది. దీనికి కారణం ఆ ప్రేమ కథలో ఆత్మ లేకపోవడమే. మైఖేల్ ఇంటర్వెల్ బాంగ్ కూడా రొటీన్ గానే వుంటుంది .హీరోని కొన ప్రాణాలతో వదిలేయడం, అతడు మళ్ళీ తిరిగిరావడం, గ్యాంగ్ డాన్ పై ఎదురుతిరగడం ఇవన్నీ రొటీన్. అయితే మైఖేల్ సెకండ్ హాఫ్ లో వచ్చిన విజయసేతుపతి పాత్ర ఈ కథని ముందుకు నడిపించడంలో సాయపడింది. ఆ పాత్ర రాసుకున్న విధానంలో లోపాలు వున్నా సరే విజయ్ సేతుపతి ప్రజన్స్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి కథల ముగింపులో ట్విస్ట్ లు అవసరం లేదు. కానీ దర్శకుడు ఒక ట్విస్ట్ రాసుకున్నాడు, అదే పండితే చాలు అనుకున్నాడు. అయితే రివీలైన ట్విస్ట్ ఈ కథకు పెద్ద ఎమోషన్ ని అయితే జోడించలేకపోయింది.

సందీప్ కిషన్ మైఖేల్ కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపై కనిపించింది. ఖచ్చితంగా ఇది అతనికి కొత్త పాత్రే. యాక్షన్ లో తన యీజ్ చూపించాడు. అయితే మైఖేల్ పాత్రలో ఉన్నంత ఇంటెన్సిటీ కథలో లేకపోవడం ఒక లోపం. గౌతమ్ మీనన్ ఫుల్ లెంత్ రోల్ లో కనిపించాడు. గురునాథ్ పాత్రలో హుందాగా వైల్డ్ గా కనిపించారు. వరుణ్ సందేశ్ కి ఇది కచ్చితంగా కొత్త పాత్రే. అతన్ని విలన్ పాత్రలకి కూడా ఎంచుకోవచ్చు. విజయ్ సేతుపతి ప్రజన్స్ మైఖేల్ కి ప్రధాన ఆకర్షణ. కథ గ్రాఫ్ పడిపోయిందనే సమయంలో కేవలం తన అప్పిరియన్స్ ఆకట్టుకున్నాడు. వరలక్ష్మీ పాత్ర చిన్నదే. అయితే ఆ ఇద్దరి కెమిస్ట్రీ బావుంది. దివ్యాంశ కౌశిక్ అందంగా కనిపించింది. అనసూయ పాత్రని బలంగానే రాసుకున్నారు కానీ.. కాస్త ఎక్కువగా డ్రమటైజ్ చేశారనే ఫీలింగ్ కలిగిస్తుంది. మిగతా నటులు పరిధిమేర చేశారు.

మైఖేల్ కి టెక్నికల్ గా మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు కనిపించాయి. ఫిల్మ్ మేకింగ్ బావుంది. కిరణ్ కెమరాపనితనం ప్రధాన ఆకర్షణ. ఒక వింటేజ్ లుక్ ని తీసుకొచ్చాడు. ఈ క‌థ 1990 ప్రాంతంలో సాగుతుంది. అప్పుడే ఎందుకు? అని ప్ర‌శ్నించ‌కూడ‌దు. జ‌స్ట్.. రెట్రో లుక్ తీసుకురావ‌డంలో మాత్ర‌మే ఈ నేప‌థ్యం స‌హాయ‌ప‌డింది. సామ్ సిఎస్ నేపధ్య సంగీతం బావుంది. నువ్వుంటే చాలు పాట రొమాంటిక్ టచ్ ఇచ్చింది. ఎడిటింగ్ లో కొన్ని లోపాలు వున్నాయి. కేజీఎఫ్ ని ఫాలో అయ్యే క్రమంలో చాలా షాట్లు క్లూ లెస్ గా వచ్చి పడుతుంటాయి. ఆర్ట్ డీసెంట్ గా వుంది. నిర్మాతలు కావాల్సింది సమకూర్చారు. దర్శకుడు రంజిత్.. కేజీఎఫ్ తరహలో ఒక గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాని చూపించాలనే ప్రయత్నం చేశాడు. మేకింగ్ లో ఆ ఛాయలు కనిపించాయి కానీ కంటెంట్ లో మాత్రం కేజీఎఫ్ కి కొన్ని కిలో మీటర్ల దూరంలో నిలబడిపోయాడు మైఖేల్.

రేటింగ్‌: 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close