మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల డిసెంబర్ 9న ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం భారత్‌లో 17.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఇది మైక్రోసాఫ్ట్ ఆసియాలో చేస్తున్న అతిపెద్ద పెట్టుబడి . ఈ పెట్టుబడిని 2026 నుంచి 2029 వరకు నాలుగేళ్లలో పెట్టనుంది. దీంతో ఈ పెట్టుబడి ఎక్కడ పెడతారన్న చర్చ ప్రారంభమయింది.చాలారాష్ట్రాలు మైక్రోసాఫ్ట్ ను పలు రకాల రాయితీలతో సంప్రదించడం ప్రారంభించాయి.
ఏఐ రంగంపైనే మైక్రోసాఫ్ట్ దృష్టి
క్లౌడ్ , AI మౌలిక సదుపాయాలు , డేటా సెంటర్ల విస్తరణ, హైపర్‌స్కేల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంపై ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నారు. హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్ రీజియన్ 2026 మధ్యలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉన్న సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పూణేలలో విస్తరిస్తాయి. సస్టైనబుల్ టెక్నాలజీ రెన్యూవబుల్ ఎనర్జీ, వాటర్‌లెస్ కూలింగ్ పై దృష్టి పెడతారు. నైపుణ్యాల అభివృద్ధి 2030 నాటికి 20 మిలియన్ మంది భారతీయులకు AI నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు.
విశాఖ ఫ్రంట్ రన్నర్ కావొచ్చు !
దేశంలో మొదటి సారిగా ఏఐహబ్ ను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు అవసరమైన .. ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.అంతే కాదు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తోంది అదే సమయంలో విశాఖకు ఉన్న భౌగోళికమైన ఆకర్షణ కూడా కలసి వస్తుంది. అందుకే మైక్రోసాఫ్ట్ కూడా విశాఖనే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
అంతా ఒకే చోట కాకుండా విడివిడిగా పలు చోట్ల పెట్టుబడి పెట్టేచాన్స్
మైక్రోసాఫ్ట్ ప్రకటించిన లక్షన్నర కోట్ల పెట్టుబడులు అంతా ఒకే చోట కాకుండా.. పలు చోట్ల పెట్టే అవకాశాలు ఉన్నాయి. పలు నగరాల్లో తమ బేస్ ను బలపరుచుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ జాబితాలోఏపీ కూడా ఉండే అవకాశం ఉంది కానీ.. మొత్తంగా ఒక్క చోటే పెట్టే అవకాశాలు లేవని అనుకోవచ్చు.


