బెంగాల్‌లో బీజేపీకి స్వీట్లు పంచుతున్న ఎంఐఎం..!

మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ… తన విస్తృతిని పెంచుకుంటూ.. బీజేపీని గెలిపించుకుంటూ పోతున్నారు. ముస్లింల ఓట్లు చీలిపోయి.. బీజేపీకి లాభం కలుగుతుందని… తెలిసినా.. ఆయన బీహార్, యూపీ, మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేశారు. మహారాష్ట్రలో.. బీజేపీ – శివసేన కూటమికి బొటాబొటి మెజార్టీ వచ్చిందంటే దానికి కారణం ఎంఐఎం చీల్చిన ఓట్లేనని తేలింది. ఇప్పుడు.. ఓవైసీ… బెంగాల్ పై గురిపెట్టారు. బెంగాల్‌లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న బీజేపీ నెత్తిన నీళ్లు పోస్తున్నారు. ముస్లింలను మచ్చిక చేసుకునే రాజకీయాలు చేస్తున్న మమతా బెనర్జీ… ఓవైసీ బెంగాల్‌లోకి వచ్చి..అక్కడ పోటీ చేస్తామని ప్రకటించడంతో… అపర కాళిక అవుతున్నారు.

ఓవైసీని పరోక్షంగా తీవ్రవాదిగా మమతా బెనర్జీ వర్ణిస్తున్నారు. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని.. బెంగాల్‌లో పోటీ చేయడానికి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముస్లిం ఓటర్లను ఓవైసీ వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఓవైసీ… ఇలాంటి విమర్శలను అవకాశాలుగా చేసుకుంటారు. ముస్లింల హక్కుల కోసం పోరాడితే తీవ్రవాదులు అంటారా అంటూ బెంగాల్‌లోకి అడుగు పెడుతున్నారు. బెంగాల్‌లోని ముస్లింలు గడ్డు పేదరికంలో మగ్గుతున్నారని… వారి జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు రావడం లేదని అంటున్నారు. ఓవైసీ కుటుంబం దశాబ్దాలుగా… హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా రాజకీయాలు చేస్తుంది. మొత్తం వారి గుప్పిట్లోనే ఉటుంది. అక్కడ పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడ్డాయో… ఓవైసీ ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ బెంగాల్‌లో ముస్లింల గురించి మాత్రం ఆలోచించడం ప్రారంభించారు.

ఎమ్‌ఐఎమ్‌ బెంగాల్‌ చీఫ్‌ కొద్ది రోజుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా మమత రంగంలోకి దిగారు. ఇక్కడ ఓవైసీ పార్టీ ముస్లిం ఓట్‌బ్యాంక్‌ను చీల్చితే.. అది తృణమూల్‌ నష్టమే..! అందుకే ముందు జాగ్రత్తగా ఎమ్‌ఐఎమ్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. ఎమ్‌ఐఎమ్‌ ఓట్లను చీల్చితే బీజేపీ కి లాభం చేకూరుతుంది. అందుకే.. ఓవైసీపై తనదైన శైలిలో మమతా బెనర్జీ విరుచుకుపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close