పారని పాచిక: బెంగాల్ లో చతికిల పడ్డ ఎంఐఎం

బీహార్ , హైదరాబాద్ ఎన్నికలలో సాధించిన విజయాల ఊపు తో , పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించుకోవడం కొద్ది నెలల క్రితం చర్చకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ లో పోటీ పూర్తిగా బిజెపి మరియు తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య కేంద్రీకృతం కావడంతో, మమతా బెనర్జీ వైపు ఉన్న ముస్లిం ఓట్ల లో కొన్ని ఎంఐఎం చీల్చినా, అది బిజెపికి అనుకూలంగా మారుతుందని , ఆ రకంగా ఓవైసీ పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కూడా కొద్ది వరకు మార్చగలడని విశ్లేషణలు వచ్చాయి. కానీ తాజా ఫలితాల బట్టి చూస్తే ఎంఐఎం పాచిక పారలేదని అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే..

Read Also : వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోకి ఎంఐఎం: మమతకు కలవరం, బిజెపికి వరం?

పశ్చిమ బెంగాల్ లోని దాదాపు 100 నియోజకవర్గాల్లో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మొదట్లో లెఫ్ట్ పార్టీల వైపు, కాంగ్రెస్ వైపు ఉన్న ఈ ముస్లింలు ఆ తర్వాతి కాలంలో మమతా బెనర్జీ కి కొమ్ముకాస్తున్నారు. అయితే తాజాగా బిజెపి ఇక్కడ బలోపేతం కావడం, రైట్ వింగ్ ఓట్లన్నీ బిజెపి వైపు తరలి వెళతాయి అన్న ప్రచారం జరగడంతో మమతా బెనర్జీ మైనారిటీల ఓట్ల పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఓవైసీ పశ్చిమ బెంగాల్ లో పోటీ చేయడం మమతా బెనర్జీ అవకాశాలకు ఏ మేరకు గండి కొడుతుంది అన్న విశ్లేషణ జరిగింది.

అయితే ఎంఐఎం మొదట అనుకున్నట్లుగా గణనీయమైన స్థానాలలో పోటీ చేయకుండా కేవలం ఏడు స్థానాలకు పోటీ కి పరిమితం కావలసి వచ్చింది. ఇదివరకే పశ్చిమబెంగాల్లో ఉన్న అబ్బాస్ సిద్ధికి తో ఎంఐఎం పార్టీ జరిపిన చర్చలు విఫలం కావడం వల్ల కూటమి ఏర్పాటు చేసే అవకాశం ఎంఐఎంకు దక్కలేదు. దీంతో ఒంటరిగా పోరుకు వెళ్ళవలసి రావడంతో కేవలం ఏడు స్థానాల్లో నే ఎం ఎం పోటీ చేసింది. అయితే ఈ ఏడు స్థానాలు కూడా ముస్లిం మెజారిటీ 50 శాతం నుండి 70 శాతం మేరకు ఉన్న నియోజకవర్గాలే. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ లోని ముస్లిమ్స్ మమతా బెనర్జీ వైపు ఏకపక్షంగా మొగ్గుచూపినట్లు ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. ప్రత్యేకించి బంగ్లాదేశ్ తో బోర్డర్ కలిగిన ప్రాంతాలలో, దీదీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. బిజెపి పాలిత కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ ల పై ఏ ప్రాంతాలలో వ్యతిరేకత ఉందని విశ్లేషకులు భావించారో, ఆ ప్రాంతాలలో తృణముల్ కాంగ్రెస్ అత్యంత మెరుగైన ఫలితాలను సాధించింది.

దీంతో, బీహార్, జిహెచ్ఎంసి ఎన్నికలలో సాధించిన విజయాల పరంపరను ఎంఐఎం నిలబెట్టుకోలేక పోయినట్లు అయింది. మరొక రకంగా చూస్తే, బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు ఏకపక్షంగా మమతా బెనర్జీకి అండగా నిలబడినట్లు అర్థమవుతుంది. మొత్తం మీద ఎంఐఎం పశ్చిమబెంగాల్లో తల బొప్పి కొట్టించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close