సినిమా కోసం ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ట్రైలర్‌తో హైప్ క్రియేట్ చేసిన సినిమాలకైతే ఇది మరింత అవసరం. ఎందుకంటే ట్రైలర్ చూసి ఒకటి ఊహించి, థియేటర్లో మరోదే కనపడితే రిజల్ట్ తేడా కొడుతుంది. అందుకే ప్రమోషన్స్‌లో సినిమా కంటెంట్ గురించి క్లారిటీ ఇవ్వడం ఎప్పుడూ సేఫ్ గేమ్. ఇప్పుడు మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా అదే చేస్తున్నారు.
మిరాయ్ ట్రైలర్‌తో అంచనాలు అమాంతం పెరిగాయి. అశోకుడు, రాముడు, జటాయువు, బౌద్ధం, సూపర్ హీరో, విలన్… ఇలా ఎన్నో ఎలిమెంట్స్ కనిపించాయి. ఇది ఎపిక్ ఫాంటసీ అని చెబుతున్నారు కానీ అసలు కథ ఏమిటో క్లారిటీ రాలేదు.
ఇప్పుడు కార్తిక్ కథ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు.“నా చిన్నప్పటి నుంచి విన్న పురాణాలు, ఇతిహాసాల నుంచి నన్ను ఎగ్జైట్ చేసిన అన్ని ఎలిమెంట్స్‌ని కలిపి ఒక కథ రాశాను. చాలా కథలు, చాలా పాత్రల సమాహారం ఇది. ఆ పాత్రలను ఈ కథలో ఎలా మిళితం చేశాననేదే సినిమా. అది ప్రేక్షకులు తెరపై అనుభూతి చెందాలి’ అని చెప్పాడు.
సాధారణంగా పురాణగాధల ఆధారంగా సినిమాలు తీయాలంటే ఒక పురాణం లేదా ఒక పాత్ర చుట్టూ కథ నడిపినా చాలానే టైమ్ పడుతుంది. అలాంటిది చిన్ననాటి నుంచి విన్న ఎన్నో పురాణ కథలను కలిపి ఒకే సినిమాగా తీర్చిదిద్దానని కార్తిక్ చెప్పడం కొత్తగానే అనిపిస్తోంది. మరి మిరాయ్ లో ఆయన చేసిన ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే మరో ఐదు రోజులు ఆగితే సరిపోతుంది.