అమరావతిలో పంటలు తగులబెడుతున్నదెవరు?

అమరావతి నిర్మాణం కోసం ఇంకా సుమారు 1400 ఎకరాల భూసేకరణ చేయవలసి ఉంది. ఆ భూములు వైకాపాకు మద్దతు ఇస్తున్న రైతుల అధీనంలో ఉన్నాయి. కనుక వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతోంది. ఈలోగా ఆ ప్రాంతంలో మల్కాపురం అనే గ్రామంలో భూసేకరణను అంగీకరించని ఒక రైతుకి చెందిన నాలుగు ఎకరాలలో చెరుకు తోటకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రైతులను భయబ్రాంతులను చేసి బలవంతంగా భూసేకరణ చేసేందుకు తెదేపాకు చెందినవారే అటువంటి నీచమయిన పనులు చేస్తున్నారని వైకాపా ఆరోపిస్తుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టి భూసేకరణ ప్రక్రియకు ఆటంకం కలిగించదానికి వైకాపాకు చెందినవారే చెరుకు పంటకు నిప్పు పెట్టారని తెదేపా నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. వాటిపై పోలీసుల చేత దర్యాప్తు జరిపించి దోషులను పట్టుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ సంఘటన జరిగి రెండు మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మళ్ళీ వారం రోజుల క్రితం మల్కాపురంలో అటువంటి సంఘటనే జరిగింది. దానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి.

ఒకవేళ ఈ పని వైకాపా నేతలే చేయించారని తెదేపా ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, వైకాపాను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు దానికి ఇదొక చక్కటి అవకాశం అవుతుంది. పోలీసులచేత దర్యాప్తు చేయించి దోషులను పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టగలిగితే రైతులు ఇక వైకాపా మాటలని నమ్మబోరు. కానీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం వలన తెదేపానే అనుమానించవలసి వస్తోంది. వారి వాధోపవాదాలతో ప్రజలను తప్పు ద్రోవ పట్టించవచ్చునేమో కానీ అక్కడి రైతులను ఆ మాటలతో మభ్యపెట్టలేరు.అటువంటి నీచమయిన పనులు ఎవరు చేస్తున్నారో అక్కడి రైతులకు ఖచ్చితంగా తెలుసు. కనుక ఇటువంటి పనులు చేసిన పార్టీలకు రైతులు దూరం అవడం తధ్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ స్పెషల్ : కేసీఆర్ రాజీనామా సవాల్ .. బండి సంజయ్ ఉరి ఆఫర్..!

అధికారంలో ఉన్న పార్టీల ముఖ్యనేతలు సవాల్ చేసుకుంటున్నారు. మీరు నిరూపించాలంటే..  మీరు నిరూపించాలని సవాల్ చేసుకుంటున్నారు. కానీ రికార్డులన్నీ తమ దగ్గరే ఉంటాయని.. నిరూపించదల్చుకుంటే క్షణంలో పని అన్న విషయాన్ని మాత్రం వారు...

ఆర్ఆర్ఆర్‌కు బీజేపీ ఫ్రీ పబ్లిసిటీ..!

రాజమౌళి దర్శకత్వంలో రెడీ అవుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రచార బాధ్యతలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. భీంపాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ లుక్.. ముస్లిం యువకుడిని పోలి ఉండటంతో బీజేపీ నేతలు...

పవన్ అభిమానులకు నచ్చే సబ్జెక్ట్ చెప్పిన హరీష్ శంకర్

ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో ఎక్కువ‌గా రీమేక్ క‌థ‌లే క‌నిపిస్తాయి. అవ‌న్నీ మంచి విజ‌యాల్ని అందించాయి కూడా. ఇప్పుడు కూడా ప‌వ‌న్ అరువు క‌థ‌ల‌పైనే ఆధార‌ప‌డుతున్నాడు. పొలిటిక‌ల్ ఎంట్రీ త‌ర‌వాత‌.. చేస్తున్న సినిమా `వ‌కీల్...

కేంద్రం నిధులిచ్చినా ఇవ్వకపోయినా పోలవరం కట్టేస్తామంటున్న అనిల్..!

పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న షాకులకు ఏపీ సర్కార్ గుక్క తిప్పుకోలేకపోతోంది. ఏం చేయాలో పాలుపోక టెన్షన్ పడుతోంది. కేంద్రాన్ని నిందించలేక... రాజకీయంగా పోరాడలేక... ప్రభుత్వంలో ఉండి. ..ప్రతీ దాన్ని టీడీపీ...

HOT NEWS

[X] Close
[X] Close