జాతిరత్నాలు సినిమా బడ్డీ కామెడీ కథలకు కొత్త జోష్ ఇచ్చింది. యూత్ ఆడియన్స్ ఇలాంటి కథలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రియదర్శి, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, సత్య ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తోంది. అదే ‘మిత్ర మండలి’.
విజయేందర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. కేవలం కవ్వించడమే లక్ష్యంగా చేసుకున్న కథ ఇది. సోషల్ మీడియా ట్రెండ్‌కు తగినట్లు వైరల్ డైలాగులు, నటీనటుల కామెడీ టైమింగ్ తో ట్రైలర్ కట్ చేశారు.
ఇలాంటి సినిమాలకి కథతో పెద్ద అవసరం వుండదు. ప్రేక్షకులు కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోరు. థియేటర్ లో కాసేపు కాలక్షేపాన్ని ఇస్తే చాలు. మిత్రమండలి ట్రైలర్ పాజిటివ్ వైబ్ కనిపించింది. నవ్వులు పంచే కంటెంట్ వుంటే మంచి ఫలితాన్ని చూసే అవకాశం వుంది.