వైకాపా ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ వద్ద హైడ్రామా!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దురుసుగా వ్యవహరించినందుకు వైకాపా ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయబడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ అందుకు తానేమీ బాధపడటం లేదని చెప్పడంతో చాలా విమర్శలు వచ్చేయి. ఆమె తన సినిమా, టీవీ కార్యక్రమాలు చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే ఆమె సభ నుండి ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసినా బాధపడటం లేదని ఉంటారని వ్యాఖ్యలు వినిపించాయి. ఆమె మాటలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లుగా గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఇవ్వాళ్ళ సభలో డిమాండ్ చేసారు.

తనను సస్పెండ్ చేసినందుకు బాధపడలేదని నిన్న చెప్పిన రోజా, ఈరోజు మళ్ళీ అసెంబ్లీకి వచ్చి హడావుడి చేసారు. అసెంబ్లీలో ఉన్న వైకాపా కార్యాలయానికి ఆమె వెళ్లబోతుంటే మార్షల్స్ ఆమెను వారించారు. కానీ ఆమె మొండిగా లోపలకి వెళ్ళే ప్రయత్నించడంతో మహిళా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. ఆ తోపులాటలో రోజా స్పృహ తప్పి పడిపోయారు. అది నిజమో నటనో ఆమెకే తెలియాలి. ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి వచ్చేరు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసుల చేత ఆమెను దౌర్జన్యంగా అరెస్ట్ చేయించడాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు.

అయితే ఆమెను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ నిన్న ప్రకటిస్తునపుడు, ఆమె కాని జగన్మోహన్ రెడ్డి గానీ పెద్దగా నిరసన వ్యక్తం చేయలేదు. కానీ ఇవ్వాళ్ళ మీడియా ముందుకు వచ్చి ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం, నిబంధలకు విరుద్దం, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటూ జగన్మోహన్ రెడ్డి బిగ్గరగా వాదిస్తున్నారు. మరి ఈ మాటలన్నీ నిన్ననే ఆమెను సస్పెండ్ చేసినప్పుడే ఎందుకు అనలేదు?ఆమె స్పీకర్ ని కలిసి క్షమాపణలు చెప్పి తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని నిన్ననే ఎందుకు అడగలేదు? కనీసం ఇవ్వాళ్ళ స్పీకర్ ని కలిసి తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని కోరుతానని నిన్న అనలేదు. కానీ ఇవ్వాళ్ళ శాసనసభకు వచ్చి ఇంత హడావుడి ఎందుకు చేసిన్నట్లు? అంటే తన గురించి ప్రజలు ఏమనుకొంటారో అని భయపడే అని అనుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా..!?

బీహార్‌ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.అంటే ఇక కరోనా భయాలను పక్కన పెట్టి అయినా తప్పక నిర్వహించాల్సిన వాటిని నిర్వహించి తీరాల్సిందేనని నిర్ణయానికి వచ్చినట్లుగా భావించవచ్చు. ఇక త్వరలో ఉపఎన్నికల తేదీలను...

పన్నెండో తేదీ కల్లా ఎమ్మెల్సీగా కవిత..!

నిజామాబాద్ ఎంపీగా ఓటమి తర్వాత నిరాశలో కూరుకుపోయిన కల్వకుంట్ల కవిత... నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికబోతున్నారు. గతంలోనే ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా...

రివ్యూ: ‘జ‌ల్లిక‌ట్టు’

భార‌తీయ సినిమా రంగంలో మ‌ల‌యాళం సినిమా ఎప్పుడూ ఓ మెట్టుపైనే ఉంటుంది. వాళ్ల ద‌గ్గ‌ర బ‌డ్జెట్లు లేక‌పోవొచ్చు. కానీ.. ఆలోచ‌న‌లున్నాయి. ఎవ‌రికీ త‌ట్ట‌ని ఆలోచ‌న‌లు, త‌ట్టినా.. చెప్ప‌లేని క‌థ‌లు వాళ్లు ధైర్యంగా చెప్పేస్తారు....

కేంద్రంపై న్యాయపోరాటానికి కేసీఆర్‌కు “కాగ్” అస్త్రం..!

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న భావనతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ న్యాయపోరాటం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా కేసీఆర్‌కు...

HOT NEWS

[X] Close
[X] Close