అదానీపై రాహుల్ ప్రశ్నలకు సమాధానమే లేని మోదీ స్పీచ్ !

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ మంగళవారం స్పీచ్ వైరల్ అయింది. ఆయన నేషనల్ హాట్ టాపిక్‌గా మారిన అదానీ గురించి చాలా ప్రశ్నలు వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రదాని మోదీ ఇచ్చే సమాధానంలో అన్నింటికీ సమాధానాలు చెబుతారని అనుకున్నారు. మోదీ వచ్చారు.. స్పీచ్ ఇచ్చారు.. కానీ అదానీ గురించి ప్రజల్లో ఉన్న సందేహాలకు కనీసం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

ఎప్పట్లాగే ప్రధాని మోదీ విపక్షాలు.. దేశం అభివృద్ధి చెందుతూంటే.. అసూయ పడుతున్నట్లుగా ప్రకటించారు. అందుకే ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కశ్మీర్ లో అద్భుతమైన స్వేచ్చ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న చాలా విజయాల గురించి చెప్పారు. ఈ క్రమంలో విపక్షాలపై సెటైర్లు వేశారు. విమర్శలు చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. అదానీ గురించి తమపై వస్తున్న విమర్శలకు ఎందుకు సమాధానం చెప్పలేదన్నది సస్పెన్స్ గానే ఉండిపోయింది.

అదానీ ఇప్పుడు నేషనల్ హాట్ టాపిక్. ఆ సంస్థ వద్ద ప్రజాధనం లక్ష కోట్లకుపైగానే ఉంది. కొన్ని లక్షల మంది మదుపరులు .. రూ. పది లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ లో నష్టపోయారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అక్రమాలకు పాల్పడటం వల్లనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఇంత జరిగినా.. అదానీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ.. సెబీ కానీ.. సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న దాఖలాలు లేవు.

ప్రధాని మోదీ ఎప్పట్లాగే.. తన మాటలతో ప్రసంగాన్ని పూర్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి .. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు .. తమ పాలనను పొగడుకోవడం.. కాంగ్రెస్ పాలనను విమర్శించడంలోనే వెదుక్కోమని చెప్పేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close