ఈనాడు ఇంటర్యూ : ఏపీ వికాసానికి మోదీ గ్యారంటీ

ఎన్నికల సందర్భంగా ఈనాడు పత్రికకు ప్రధాని మోదీ ఇంటర్యూ ఇచ్చారు . ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఇంటర్యూను ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ ఇంటర్యూలో ఏపీ వికాసానికి మోదీ సంపూర్ణ గ్యారంటీ ఇచ్చారు. ఏపీ ప్రజల కోసం తీసుకుంటున్న చర్యలు.. చేసిన సాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పోలవరం పూర్తికి గ్యారంటీ

ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు మొదటి ఐదేళ్లు ఈ ప్రాజెక్టు పరుగులు పెట్టింది. కానీ గత ఐదేళ్లు పూర్తిగా పడకేసింది. ఈ అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీన్ని మోదీ పటా పంచలు చేసే ప్రయత్నాన్ని ఈనాడు ఇంటర్యూలో చేశారు. పోలవరం పూర్తి చేసే గ్యారంటీ తనదని స్పష్టం చేశారు. సమస్యగా మారిన ఆర్ అండ్ ఆర్ అంశంపైనా ప్రత్యేక కమిటీ వేశామన్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించింది. చంద్రబాబు ప్రభుత్వం శరవేగంగా నిర్మిస్తూ డబ్బులు రీఎంబర్స్ చేసుకుంది. జగన్ ప్రభుత్వం నిర్మించకుండానే డబ్బులు కావాలని మోదీ సర్కార్ వెంట పడింది. నిర్మాణం ఆగిపోయింది. ఫలితంగా ఎన్నో సమస్యలు వెలుగు చూశాయి. ఇప్పుడు మోదీ ఈ ప్రాజెక్టు పూర్తిగా తన గ్యారంటీ అని హామీ ఇవ్వడం కూటమికి మంత బలంగా మారనుంది.

విభజన హామీల అమలుకు భరోసా

విభజన హామీల అమలుకు మోదీ భరోసా ఇచ్చారు. విభజన చట్టం సమస్యల పరిష్కారం.. రెండురాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడం వల్లనే సాధ్యం కాదని.. చట్టం ప్రకారం.. తాము జోక్యం చేసుకోవాల్సి వస్తే.. పరిష్కరిస్తామని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం నెలకొల్పాల్సిన విద్యా సంస్థలు.. ఇతర ప్రాజెక్టులను శరవేగంగా మొదటి ఐదేళ్లలోనే అందుబాటులోకి తెచ్చినట్లుగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన చట్టం ప్రకారం.. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో స్పష్టమైన కార్యాచరణ ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. ఎన్డీఏలో టీడీపీ ఉన్న సమయంలో విభజన చట్టంలో ఉన్న సంస్థలన్నీ శరవేగంగా మంజూరయ్యాయి. అవన్నీ ఇప్పుడు ప్రముఖ సంస్థలుగా మారాయి.

కేంద్రం సహకారం పై భరోసా

ప్రధాని మోదీ ఏపీలో తమ ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు. ఇంతకు ముందు జరిగిన ఇంటర్యూల్లో ఏపీలో కూటమి ఘన విజయం సాధించబోతోందని.. వికసిత ఆంధ్రాను ప్రజలు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా ఏపీలో ప్రచారానికి వచ్చే ముందు మోదీ .. ఏపీ ప్రజలకు తన గ్యారంటీని ఇచ్చారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

మరికాసేపట్లో భారీ వర్షం…ఎవరూ బయటకు రావొద్దని అలర్ట్..!!

హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని...

సీరియల్ న‌టుడు చందు ఆత్మ‌హ‌త్య‌కు అస‌లు కార‌ణాలు ఇవేనా?

బుల్లి తెర ప్రేక్షకులు దిగ్బ్రాంతిలో ఉన్నారు. కారణం త్రినయని సీరియల్ యాక్టర్స్ వరుసగా ఈ లోకం వీడి వెళ్లిపోవ‌డ‌మే. మొదట ఈ సీరియల్ లో కీల‌క పాత్ర పోషించిన‌ పవిత్రా జయరాం యాక్సిడెంట్...

అప్పుడే చంద్రబాబు ఆన్ డ్యూటీ..!!

అల్లర్లతో ఏపీ అట్టుడుకుతుంటే సీఎంగా తన బాధ్యతను జగన్ రెడ్డి విస్మరించి విదేశాలకు వెళ్ళగా... ఇప్పుడు ఆ బాధ్యతలను చంద్రబాబు నిర్వర్తిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్ళడంతో చంద్రబాబు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close