అదంపూర్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ సందర్శించిన అనంతరం ప్రధాని మోడీ జవాన్లను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. ఈ నినాదం యొక్క శక్తి ఏమిటో ప్రపంచం అంతా చూసిందని అన్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదం భారతీయులందరి ఆకాంక్షను ప్రతిబింబించిందని వివరించారు.
ఆపరేషన్ సింధూర్ మామూలు సైనిక దాడి కాదన్న మోడీ.. భవిష్యత్ లో సైనికుల సాహసాల గురించి అందరూ మాట్లాడుకుంటారని వివరించారు. త్రివిధ దళాలకు దేశం తరఫున తరఫున సెల్యూట్ చేసిన మోడీ..ఆపరేషన్ సింధూర్ జయద్వానాలు దేశమంతా వినిపిస్తున్నాయన్నారు.
ఉగ్రవాదాన్ని కాపాడుతున్న పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ ఓడించింది అని పేర్కొన్నారు. భారతీయ మహిళల నుదిటిపై ఉన్న సింధూరం లాక్కున్నప్పుడు, భారత సైన్యం వారి ఇళ్లలోకి ప్రవేశించి వారిపై దాడి చేశాయని వివరించారు. ఉగ్రదాడి సమయంలో వారు సవాలు చేసింది భారత సైన్యంతో అని వారు మర్చిపోయినట్టు ఉన్నారని అన్నారు.
దేశమంతా సైనికుల వైపుగా ఉందని వివరించారు మోడీ. భారత్ మాతాకీ జై నినాదాలతో శత్రు దేశం కంపించిపోయిందన్నారు. న్యూక్లియర్ బాంబులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వీరుల దర్శనం కోసమే ఇక్కడికి వచ్చానని సైనికుల సాహసాలను ప్రశంసించారు.వీరుల దర్శనం దొరికితే జన్మ ధన్యమైనట్లేనని సైనికుల పరాక్రమాన్ని కొనియాడారు.