ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీహార్ ఓటర్లపై ఎమోషనల్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత బీహార్ ఎన్నికలపై దృష్టి సారించారు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉంది కాబట్టి ఎలక్షన్ డ్యూటీ ప్రారంభించారు. బీహార్లో జరిగిన ఓ సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ తల్లిసెంటిమెంట్ తో అందరి కళ్లలోనూ నీళ్లు తెప్పించారు.
ఇటీవల రాహుల్ గాంధీ చేస్తున్న ఓటర్ అధికారయాత్రలో ఓ కాంగ్రెస్ కార్యకర్త మోదీ తల్లిని అత్యంత దారుణంగా తిట్టిన వీడియో వైరల్ అయింది. దానిపై బీజేపీ నేతుల మండి పడుతున్నారు.రాహుల్ అలాంటివాటిని ప్రోత్సహిస్తున్నారని ..క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం జరిగినప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ..రాగానే భావోద్వేగానికి గురయ్యారు.
కాంగ్రెస్ చేసిన అవమానం కేవలం తన తల్లికి మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు జరిగిన అవమానమని ఆయన అన్నారు. ఈ అవమానం మహిళల గౌరవానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. తన పేద తల్లి చనిపోయారని.. ఆమెకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా తిడుతున్నారన్నారు. యువరాజు .. గోల్డెన్ స్ఫూన్ తో పుట్టాడని అతనికి పేద తల్లిపై గౌరవం ఉండదన్నారు.
మోదీ తల్లిని తిట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయినప్పటికీ అమిత్ షా రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నౌషాద్ అనే స్థానిక నాయకుడు క్షమాపణ చెప్పారు.కానీ కాంగ్రెస్ నైజం మహిళల్ని అవమానించడమేనని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మోదీ తన ప్రసంగం సమయంలో ఎదురుగా ఉన్న వారిలో చాలా మంది భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.