మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్‌కు మరో విశిష్ట గౌరవం లభించింది. అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. మోహన్‌లాల్ నటన, ప్రతిభ, సేవలు, భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కేంద్రం కొనియాడింది.
మోహన్ లాల్ కు ఇప్పటికే పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగంలోని అత్యుత్తమ అవార్డు. ఇంతకుముందు మలయాళ పరిశ్రమలో అదూర్ గోపాలాకృష్ణన్ ఈ గుర్తింపు పొందారు. ఇప్పుడు మోహనలాల్ కు ఈ గౌరవం వరించింది. సెప్టెంబరు 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మోహన్‌లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.