హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు రెండు ప్రాంతాలు ఎక్కువ డిమాండ్ లో ఉన్నాయి. నియోపోలిస్ అనేది అల్ట్రా రిచ్ వాళ్లకు పరిమితమైపోయింది. కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోలేం. ఇక కాస్త ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ప్రాంతాలు కొల్లూరు, మోకిలా. దానికి తగ్గట్లుగానే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
మోకిలా, హైదరాబాద్‌లో కాస్త దూరమే కానీ..అక్కడ ఇళ్లు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి లచూపిస్తున్నారు. శంకర్పల్లి-హైదరాబాద్ హైవే ద్వారా బాగా కనెక్ట్ అయింది . ఔటర్ రింగ్ రోడ్ (ORR) కు సమీపంలో ఉంది. 2025లో, మోకిలాలో విల్లాలు , ప్లాట్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడి ప్రాపర్టీ ధరలు ప్లాట్లు స్క్వేర్ యార్డుకు రూ. 46,000 నుంచి రూ. 80,000 వరకు, విల్లాలు (4BHK) రూ. 1.9 కోట్లు నుంచి రూ. 2.45 కోట్లు వరకు పలుకుతున్నాయి. మోకిలాలో కొత్త రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్ మరియు షాపింగ్ జోన్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆకుపచ్చని ప్రకృతి, ప్రశాంతత, లగ్జరీ విల్లా కోరుకునేవారికి బాగా నచ్చుతోంది.
కొల్లూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో ఉంది. ORR ద్వారా బాగా కనెక్ట్ అయింది. 2025లో, కొల్లూరులో అపార్ట్మెంట్లు , విల్లాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్లాట్లు స్క్వేర్ యార్డుకు రూ. 55,000 నుంచి రూ. 75,000 వరకు, విల్లాలు (3BHK) రూ. 2.42 కోట్లు నుంచి రూ. 2.87 కోట్లు వరకు చెబుతున్నారు. అపార్ట్మెంట్లు స్క్వేర్ ఫీట్‌కు రూ. 6,150 వరకూ ఉంది. స్కూల్స్, హాస్పిటల్స్ , మాల్స్ ఇప్పటికే అభివృద్ధి చెందాయి.
కొల్లూరు మంచి కనెక్టివిటీ , వేగవంతమైన వృద్ధి కారణంగా త్వరిత పెట్టుబడి రాబడికి మంచిదని అనుకోవచ్చు. అయితే మోకిలాను తక్కువ అంచనా వేయలేం కానీ.. ప్రశాంతమైన జీవనం, నగర్ వాతావరణానికి దూరంగా ఉండాలనుకునేవారికి బాగుంటుంది. అక్కడే ప్రస్తుతం ధరలు ఎక్కువగా ఉన్నాయి. కొల్లూరులో జన సమ్మర్ధం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
