పాత్ర‌లు మార్చుకున్న బాల‌య్య – మోక్ష‌జ్ఞ‌

ఆదిత్య 369పై మ‌ళ్లీ బాల‌కృష్ణ దృష్టి పెడుతున్నారు. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కించాల‌న్న‌ది బాల‌కృష్ణ ప్లాన్‌. సింగీతం ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేశారు. దాన్ని ఈమ‌ధ్య బాల‌య్య ఓ యువ ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాతోనే మోక్ష‌జ్ఞ‌ని ప‌రిచ‌యం చేయాలని బాల‌కృష్ణ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. బాల‌య్య‌నే హీరో. కానీ మోక్ష‌జ్ఞ ఓ పాత్ర‌లో త‌ళుక్కున మెరుస్తార‌న్న‌మాట‌. అలా.. మోక్ష‌జ్ఞ‌ని త‌న అభిమానుల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని భావించారు.

అయితే… ఇప్పుడు బాల‌య్య ప్లాన్ మారింది. ఈ స్క్రిప్టుతోనే మోక్ష‌జ్ఞ‌ని సోలో హీరోగా అభిమానుల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని భావిస్తున్నారు. అందుకే మోక్ష‌జ్ఞ‌ని దృష్టిలో ఉంచుకుని ఈ స్క్రిప్టుని మార్చ‌మ‌ని ద‌ర్శ‌కుడికి సూచించిన‌ట్టు తెలుస్తోంది. ఇది వ‌ర‌కైతే బాల‌య్య‌నే హీరో. మోక్ష‌జ్ఞ గెస్ట్‌లా క‌నిపిస్తాడు. ఇప్పుడు మాత్రం మోక్ష‌జ్ఞ హీరో. ఓ పాత్ర‌లో బాల‌కృష్ణ క‌నిపిస్తారని తెలుస్తోంది. అలా బాల‌కృష్ణ‌, మోక్ష‌జ్ఞ పాత్ర‌లు మార్చుకుంటున్నార‌న్న‌మాట‌. `మోక్ష‌జ్ఞ ఎంట్రీ భారీగా ఉండ‌బోతోంది. త‌న కోసం అద్భుతమైన క‌థ సిద్ధ‌మైంది` అని ఇటీవ‌లే బాల‌య్యే చెప్పేశారు. ఆ క‌థ `ఆదిత్య 999`నే కానుంద‌ని నంద‌మూరి కాంపౌండ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించాల‌న్న ఆలోచ‌న కూడా ఉంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

‘RRR’కి పోటీనే లేదా?

సంక్రాంతి బ‌రిలోకి RRR దిగ‌డంతో... స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ సంక్రాంతికి భీమ్లా నాయ‌క్‌, ఎఫ్ 3, స‌ర్కారు వారి పాట‌, రాధే శ్యామ్ ముందుగానే క‌ర్చీఫ్ లు వేసుకున్నాయి. అయితే స‌డ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close