ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ వ‌ద్ద‌న్నా.. ఎన్టీఆర్ చేశాడు

ఓ హీరో కోసం అనుకున్న క‌థ‌, మ‌రో హీరో చేయ‌డం చిత్ర‌సీమ‌లో మామూలే. అలా కొన్ని వంద‌ల క‌థ‌లు చేతులు మారి ఉంటాయి. కానీ ఏ ఒక్క‌సంద‌ర్భంలోనూ.. `నేను ఆ క‌థ‌ని వ‌దులుకున్నా.. నువ్వు కూడా చేయ‌కు` అని సాటి హీరోకి మ‌రో హీరో చెప్ప‌లేదేమో. కానీ.. ఆ సంద‌ర్భం ఓసారి వ‌చ్చింది. అక్కినేని, ఎన్టీఆర్ విష‌యంలో.

1960 నాటి సంగ‌తి ఇది. బిఏ సుబ్బారావు అనే ద‌ర్శ‌కుడు `రాణీ ర‌త్న‌ప్ర‌భ` అనే క‌థ ప‌ట్టుకుని నాగేశ్వ‌ర‌రావు ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఆ క‌థ నాగేశ్వ‌ర‌రావుకి పెద్ద‌గా న‌చ్చ‌లేదు. క‌థంతా దాదాపు క‌థానాయిక‌గా చుట్టూనే తిర‌గ‌డం అందుకు ఓ కార‌ణం. `ఇందులో అంజ‌లీదేవి పాత్రే ఎక్కువ క‌దా.. నేను చేయ‌డానికి ఏముంది` అంటూ నాగేశ్వ‌ర‌రావు ఆ సినిమాని తిర‌స్క‌రించారు. దాంతో సుబ్బారావు ఈ ప్రాజెక్టుని ఎన్టీఆర్ తో చేయాల‌ని ఫిక్స‌య్యారు. ఈ కాంబినేష‌న్‌లో `రాణీ ర‌త్న ప్ర‌భ‌` సినిమా వ‌స్తోంద‌న్న వార్త తెలిసి… ఎన్టీఆర్‌కి ఫోన్ చేశార్ట నాగేశ్వ‌ర‌రావు.

`బ్ర‌ద‌ర్‌.. రాణీ ర‌త్న ప్ర‌భ అనే సినిమా మీరు చేస్తున్నార‌ని తెలిసింది. ఆ క‌థ నాకూ వినిపించారు. నాకు ఏమాత్రం న‌చ్చ‌లేదు. మీ ఇమేజ్‌కి కూడా అది స‌రిప‌డ‌దు. ఈ సినిమా చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది` అని స‌ల‌హా ఇచ్చారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం `బిఏ సుబ్బారావు గారు నాకు బాగా కావ‌ల్సిన మ‌నిషి. ఇండ్ర‌స్ట్రీలో నేను అడుగుపెట్ట‌డానికి కార‌ణం ఆయ‌నే. నేను ఆయ‌న‌కు మాటిచ్చాను. ఈ ప‌రిస్థితుల్లో నేనిచ్చిన మాట వెన‌క్కి తీసుకోలేను` అనేశారు.

ఇచ్చిన మాట ప్ర‌కారమే.. ఎన్టీఆర్ ఆ సినిమా చేసేశారు. షూటింగ్ అంతా అయిపోయింది. రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది.

రేపు ఈ సినిమా విడుద‌ల అన‌గా… ఆరోజు రాత్రి నాగేశ్వ‌ర‌రావు నిద్ర‌పోలేద‌ట‌. `బ్ర‌ద‌ర్‌కి ఈ సినిమా చేయొద్దని చెప్పా. ఆయ‌న చేశారు. ఇప్పుడు ఆ సినిమా ఆడుతుందా లేదా? ఆడితే నా జ‌డ్జిమెంట్ పోయిన‌ట్టే. ఆడ‌క‌పోతే.. బ్ర‌ద‌ర్ న‌ష్ట‌పోతారు..` అనే ఆలోచ‌న‌ల‌తో నిద్ర రాలేద‌ట‌.

తెల్లారి మార్నింగ్ షో అయ్యాక‌… త‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌స్థుడైన ఓ థియేట‌ర్ య‌జ‌మానికి ఫోన్ చేసి.. `సినిమా రిజ‌ల్ట్ ఏమిటి` అని అడిగార్ట‌.

`సినిమా ఏం బాలేదండీ. ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కాదిది` అని చెప్పే వ‌ర‌కూ.. ఆయ‌న టెన్ష‌న్ ప‌డుతూనే ఉన్నార్ట‌. ఈ విష‌యాన్ని అక్కినేని త‌న ఆత్మ‌క‌థ‌లో రాసుకున్నారు. మ‌రో హీరో సినిమా కోసం ఓ హీరో ఇంత‌లా ఆలోచించ‌డం, అదీ ఆ స‌మ‌యంలో త‌న‌కు ఏకైక పోటీ దారుడి సినిమా గురించి ఆరాట ప‌డ‌డం విచిత్ర‌మే.

అయితే అక్కినేని మాట‌ల‌కు, చేష్ట‌ల‌కూ ఎన్టీఆర్ అభిమానులు మ‌రోలా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. `మా హీరో సినిమా ఎక్క‌డ హిట్ట‌యిపోతుందో అన్న భ‌యంతో.. అక్కినేనికి నిద్ర ప‌ట్టి ఉండ‌దు` అని చెప్పుకున్నారు. నిజానికి `రాణీ ర‌త్న ప్ర‌భ‌` చూడ‌ద‌గ్గ సినిమానే. పాట‌లు బాగుంటాయి. కాక‌పోతే… హీరోయిన్ డామినేష‌న్ ఎక్కువ‌. మ‌రో హీరో చేసుంటే.. ఇంకాస్త మంచి ఫ‌లితం వ‌చ్చేదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న నిమ్మగడ్డ..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవుతున్నారు. ఇరవై ఎనిమిదో తేదీన ఆయన అన్ని పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం ప్రకటిస్తారు. స్థానిక...

నెలాఖరు వస్తే బుగ్గన క్యాంప్ ఢిల్లీలోనే..!

నెలాఖరు వచ్చే సరికి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి ఢిల్లీలో ఎక్కేగడప... దిగే గడప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గత నెలాఖరులో ఢిల్లీకి వెళ్లి... అప్పుల పరిమితిని పెంచుకోవడంలో సక్సెస్ అయిన...

రైతుల ఆర్తనాదాలు మోదీకి వినిపించినా .. ఆలకిస్తారా..!?

శంకుస్థాపన చేసి గొప్ప రాజధాని అవ్వాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీనే అమరావతిని కాపాడాలని రైతులు ముక్తకంఠంతో వేడుకున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతులు అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు....
video

నర్త‌నశాల ట్రైల‌ర్‌: ఆనాటి సౌర‌భాలు

https://www.youtube.com/watch?v=cgUlBCD10ZM&feature=youtu.be బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌కత్వంలో మొద‌లెట్టిన‌ చిత్రం `న‌ర్త‌న శాల‌`. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా 5 రోజులు షూటింగ్ జ‌రుపుకుని ఆగిపోయింది. అప్ప‌ట్లో తీసిన రెండు స‌న్నివేశాల్ని.. ఇప్పుడు, ఇంత‌కాలానికి విడుద‌ల...

HOT NEWS

[X] Close
[X] Close