డిజిటల్ కార్పొరేషన్ – ప్రజాధనం మేసిన మరో ముఠా !

జగన్ హయాంలో ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకుతిన్న ముఠాలకు కొదవలేదు. ఇలాంటి ముఠాల్లో డిజిటల్ కార్పొరేషన్ ఒకటి. ఈ కార్పొరేషన్ పేరుతో పెట్టిన ఖర్చు అంతా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పెట్టిందే.

ఈ డిజిటల్ కార్పొరేషన్ అనేది పెద్ద స్కాముల పుట్ట. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉద్యోగాలు చేయకపోయినా చేస్తున్నట్లుగా క్రియేట్ చేసి వందల మందిని పేరోల్స్ లో పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని పోషింటారు. ఈ వివరాలను టీడీపీ నేత విజయకుమార్ ప్రకటించారు.

కనీసం ఐదు వందల కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. అంతకు మించిన స్కాం ఉందని.. లోతైన దర్యాప్తు జరపబోతున్నారని అంటున్నారు. డిజిటల్ కార్పొరేషన్, స్కిల్ కార్పొరేషన్ పేరుతో చేసిన వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తే.. చిన్న వాసుదేవరెడ్డికి అనే వ్యక్తికి చిప్పకూడు ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న వాసుదేవరెడ్డినే డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్. జగన్ రెడ్డిని నమ్ముకుని ఏపీకి వచ్చి నామినేటెడ్ పదవులు పొందిన కొంత మంది ఎంత సంపాదించుకున్నారో కానీ అంత కంటే ఎక్కువగా పరువు పోగొట్టుకోబోతున్నారు. అందులో ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి ఒకరు. 2019కి ముందు అమెరికా వెళ్లిన జగన్ కు అక్కడ పర్యటించడానికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి..తన ఐడ్రీమ్ మీడియా ద్వారా బోలెడంత ప్రచారం చేసి పెట్టిన ఆయనకు జగన్ సీఎం గానే డిజిటల్ కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ ను చేశారు.

పనిలో పనిగా వాసుదెవరెడ్డి కూడా పెద్ద ఎత్తున వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు లెక్కలు బయటకు తీస్తే ఇందులో ఉన్న బొక్కలన్నీ బయట పడుతున్నాయి. ఇవన్నీ తుడిచేస్తే చెరిగిపోయే వ్యవహారాలు కాదని.. డిజిటల్ సాక్ష్యాలతో ఉంటాయని అంటున్నారు. అందుకే ఆయన అమెరికా వెళ్లిపోయినా… సరే.. వదలబోరని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close