కోకాపేట్ నియోపొలిస్ లేఅవుట్లో ప్లాట్ల విక్రయంతో భారీ ఆదాయం సమకూరుతూండటంతో ఇతర స్థలాలను కూడా వేలం వేయడానికి హెచ్ఎండీఏ రెడీ అయింది. ఈ నెలలో హెచ్ఎండీఏ, కోకాపేట్ నియోపొలిస్ లేఅవుట్లో 29 ఎకరాల ప్లాట్లను ఆన్లైన్ వేలం వేసింది. బిల్డర్ల నుంచి అంచనా కంటే ఎక్కువ స్పందన వచ్చింది. టోల్ బూత్‌లకు ఎడమ వైపు హెచ్ఎండీఏ భూములు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా వేలం వేయడానికి రెడీ అవుతున్నారు.
పదేళ్ల క్రితం 70 ఎకరాల భూమిని ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 11 కంపెనీలకు లీజుకు ఇచ్చినా, ఒక్క కంపెనీ కూడా ఆ భూమిలో సంస్థలు ఏర్పాటు చేయలేదు. లీజు కాలం ముగిసింది. కంపెనీలు కూడా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలని అనుకోవడంలేదు. మొత్తం భూమి హెచ్ఎండీఏ ఆధీనంలోకి వచ్చింది. లీజు క్యాన్సిలేషన్ ప్రక్రియ పూర్తి చేసి.. వేలం వేయనున్నారు.
ఈ 70 ఎకరాల వేలం ద్వారా ఎకరాకు రూ.100 కోట్లు చెల్లించినా మొత్తం రూ.7 వేల కోట్లు వస్తాయని హెచ్ఎండీఏ అంచనా. మార్కెట్ స్పందన మరింత బాగుంటే రూ.8 వేల కోట్లు దాటవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందుకు లీజు సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించారు.