ఓటుకు నోటు కేసులో త్వరలో మరికొన్ని పెద్ద తలకాయలు అరెస్ట్?

ఓటుకు నోటు కుంభకోణం కేసులో దూకుడు పెంచాలని తెలంగాణ ఏసీబీ నిర్ణయించింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టు చివరిది కాదని ఏసీబీ వర్గాలు తెలిపాయి. తెలుగు దేశం పార్టీకి చెందిన కనీసం ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలను విచారణకు పిలిచి అరెస్టు చేయడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఏసీబీ అరెస్టు చేయబోయే వారిలో ప్రముఖ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రెండు మూడు రోజుల్లో నోటీసు ఇవ్వాలని కూడా ఏసీబీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ కేసులో వీలైనంత ఉచ్చు బిగించాలని రాష్ట్ర్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఇప్పటికీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు నోటీసు ఇవ్వాలని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి తీవ్రనిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడకూడదని ఏసీబీకి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఎమ్మెల్యే సండ్రను ఏడుగంటల పాటు విచారించిన తర్వాత ఏసీబీ అరెస్టు చేసింది. మొదటిసారి విచారణకు పిలిచనప్పుడు ఆయన రాకపోయినా, పదిరోజులు ఆలస్యంచేసినా ఏసీబీ ఒపిక వహించింది. ఆయన తనంత తానుగా వచ్చిన తర్వాతే అరెస్టు చేసింది.

మరో ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేల విషయంలో్నూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తారని సమాచారం. ముందు విచారణకు పిలిచి, తర్వాత అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. ముగ్గురు ఎంపీలో ఒకరు కీలక స్థానంలో ఉన్న నేత అని సమాచారం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వదలకూడదని ప్రభుత్వం పట్టుదలతో ఉందని భోగట్టా. రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు ప్రయత్నం విఫలం కావడంతో మిగతా అనుమానితులపై ఏసీబీ దృష్టి పెట్టింది.

ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. అయితే, దాని దగ్గర ఆధారాలు ఏమీ లేవని తెరాస నేతలు చెప్తున్నారు. ఊరికే తాటాకు చప్పుళ్లలా ప్రకటనలు చేయడం తప్ప వారు ఏమీ చేయలేరనే ధీమా గులాబీ శిబిరంలో కనిపిస్తోంది. టీడీపీ నేతలు మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఆషామాషీ విషయం కాదని, ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరుకున పెడుతుందని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సహకరించాలంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు మొబైల్ సర్విస్ ప్రొవైడర్లకు రాసిన లేఖలు లభించాయని, దీంతో తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ధీమాగా చెప్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు ఇచ్చిన సీఐడీ !

ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి ...ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.....

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close