అయ్‌బాబోయ్ అనిరుథ్‌…!

అనిరుథ్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. తాజాగా జ‌వాన్ తో హిట్టు కొట్టేస‌రికి బాలీవుడ్ సైతం అనిరుథ్‌ని కావాల‌నుకొంటోంది. టాలీవుడ్ లోని అగ్ర ద‌ర్శ‌కులు, హీరోలు, నిర్మాత‌లు సైతం అనిరుథ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. తెలుగులో అనిరుథ్ చేసిన సినిమాలు చాలా త‌క్కువ‌. ఇప్పుడు కూడా త‌ను తెలుగు సినిమాల‌పై పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. దానికి తోడు… త‌న ఆటిట్యూడ్ తో నిర్మాత‌లు కూడా బాబోయ్ అనిరుథ్ అంటున్నారు.

టాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర నిర్మాత త‌న సినిమాకి అనిరుథ్‌ని ఎంచుకోవాల‌నుకొన్నాడు. అయితే.. అనిరుథ్ ఫోన్లో దొర‌క‌లేదు. ఎలాగోలా.. అనిరుథ్ ని ప‌ట్టుకొంటే ప‌ట్టుమ‌ని 5 నిమిషాల పాటు అప్పాయింట్ మెంట్ ఇచ్చాడ‌ట‌. అది కూడా అర్థరాత్రి 12 గంట‌ల త‌ర‌వాత‌. దాంతో.. నిర్మాత ‘నాకు అనిరుథ్ వ‌ద్దు.. గినిరుథ్ వ‌ద్దు..’ అనుకొని బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఇదే సీన్ అంద‌రి దాదాపు ప్ర‌తి నిర్మాత‌తోనూ రిపీట్ అవుతున్న‌ట్టు స‌మాచారం. అనిరుథ్ చాలా చూజీగా ఉంటాడు. ప్ర‌తీ సినిమా చేయ‌డు. పారితోషికం ఎంత ఇస్తామ‌న్నా ప‌ట్ట‌దు. త‌న టైమింగ్స్, రూల్స్ చాలా క‌ష్టంగా ఉంటాయ‌ని టాక్. వాటిని భ‌రించ‌లేకే తెలుగు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు అనిరుథ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం లేదు. అందుకే కొన్ని సార్లు తమన్ తో చిన్న సమస్యలు ఉన్నా కూడా తమన్ యే బెటర్ అని అనుకుంటున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారం ముగిసింది – 30న అసలు యుద్ధం !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అసలు ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకూ ప్రచారంలో ముందు మేమున్నామంటే.. మేమున్నాని చెప్పుకునేందుకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేసిన పార్టీలు.. ఇప్పుడు అసలు యుద్ధం ప్రారంభించాయి....

మరో ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు జైలు శిక్ష – సిగ్గు రాదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకాల గురించి గ్రంధాలు రాసినా తరగనంత సాహిత్యం పోగుపడిపోయింది. కోర్టుల దగ్గర ఉన్న ధిక్కార పిటిషన్లను లెక్కేసుకోవడానికి ఐదేళ్లు చాలవు. అతి కష్టం మీద తీర్పు వచ్చినా వాటిని అమలు...

ఏపీ సర్కార్ వారి డేటా ఎనలిటికల్ యూనిట్ – పెద్ద ప్లానే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డేటా ఎనలిటికల్ యూనిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం డేటా ఎనలటిక్స్ చేస్తుందంటే... ఆదాయమంట. ఆదాయం ఎక్కడ తగ్గిపోయిందో గుర్తించి పెంచడానికి ఈ యూనిట్...

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close