థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా అక్టోబ‌రు రెండో వారంలో థియేట‌ర్లు ఓపెన్ అవ్వొచ్చు అన్న సంకేతాలు అందుతున్నాయి. అయితే అనుమ‌తులు వ‌చ్చినంత మాత్రాన కొత్త సినిమాలు రిలీజ్ చేసే ప‌రిస్థితుల్లో నిర్మాత‌లు లేరు. ఎందుకంటే రిలీజ్ చేశాక‌… జనాలు థియేట‌ర్ల‌కు రాక‌పోతే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది అంద‌రి భ‌యం. పైగా 50 శాతం ఆక్యుపెన్సీతో స‌రిపెట్టుకోవ‌డానికి ఎవ్వ‌రూ సిద్ధంగా లేరు.

అందుకే… ట్రైల్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే ఓటీటీలో విడుద‌లైన కొన్ని సినిమాల్ని థియేట‌ర్ల‌లో రీ – రిలీజ్ చేయాల‌న్న‌ది నిర్మాత‌ల ప్లాన్‌. వి, పెంగ్విన్‌, కృష్ణ అండ్ హిజ్ లీల‌, ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య లాంటి చిత్రాలు ఇప్ప‌టికే ఓటీటీలో విడుద‌ల‌య్యాయి. వీటిలో కొన్నింటిని థియేట‌ర్ల‌లో కూడా విడుద‌ల చేసి, ప్రేక్ష‌కుల స్పంద‌న ఎలా ఉందో.. చూడాల‌న్న‌ది ప్లాన్‌. ఓటీటీలో విడుద‌లైనా – జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌చ్చి, సినిమా చూడాల‌న్న ఉత్సాహం చూపితే అది క‌చ్చితంగా నిర్మాత‌ల‌కు ఉత్సాహాన్ని ఇచ్చే విష‌య‌మే. అస‌లు ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ల‌కు వ‌చ్చే మూడ్ ఉందా, లేదా? అని తెలుసుకోవ‌డానికి ఇదో ట్రైయిల్ ఆప‌రేష‌న్ అనుకోవాలి. ద‌స‌రా, దీపావ‌ళి సీజ‌న్ల‌పై చిత్ర‌సీమ ఇప్పుడు ఆశ‌లు పెట్టుకుంది. ఎంత లేద‌న్నా.. ఆ స‌మ‌యానికి థియేట‌ర్లు తెర‌చుకుని, ప్రేక్ష‌కుల్లోనూ కొత్త సినిమాలు చూడాల‌న్న ఆస‌క్తి పెరుగుతుంద‌ని చిత్ర‌సీమ భావిస్తోంది. మ‌రి.. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close