రివ్యూ: మిస్టర్ కింగ్

Mr King Movie Review

తెలుగు360 రేటింగ్ 1.75/5
ఒకే ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఆసక్తికరంగా చెప్పడం ఒక పద్దతి. అనేక అంశాలని టచ్ చేస్తూ చాలా విషయాలని ఒకే కథలో చెప్పాలనుకోవడం మరో పద్దతి. విజయ నిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ (నరేశ్‌ కజిన్‌ రాజ్‌కుమార్‌ కొడుకు) హీరోగా పరిచయమైన ‘మిస్టర్ కింగ్’ సినిమా కోసం రెండో పద్దతిని అనుసరించాడు కొత్త దర్శకుడు శశిధర్ చావలి. మరి దర్శకుడు చెప్పదలచుకున్న అంశాలు ఏమిటి ? అవి ఎంత కొత్తగా వున్నాయి ? ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించాయా లేదా ?

శివ (శరణ్‌ కుమార్‌) మామూలు కుర్రాడు కాదు… జీనియస్. గొప్ప ఆదర్శభావాలు కలిగిన వ్యక్తి. కేవలం జీతం కోసం పని చేయడం అతనకి ఇష్టం వుండదు. ఇంధనం అవసరం లేకుండా గాలి శక్తితో పనిచేసే కాలుష్యరహిత విమానాన్ని తయారుచేసే ‘ప్రాజెక్ట్ వాయు’ మిషన్ కోసం పని చేస్తుంటాడు. పార్ట్ టైమ్ జాబ్ గా తనకి ఇష్టమైన ఆర్జే గా పని చేస్తుంటాడు. సీతారామరాజు (మురళి శర్మ) చెడ్డవాడు కాదు కానీ మనసులో కపటం వుంటుంది. ఓ ఆస్తి తగాదలో అన్న పై ఆక్రోశం పెంచుకుంటాడు. సీతారామారాజు కూతురు ఉమాదేవి (యశ్విక) తండ్రిచాటు బిడ్డ. తండ్రిని కాదని ఏ పని చేయలేదు? సీతారామరాజు అన్న కూతురు వెన్నెల (ఊర్వీ సింగ్). ఉమాదేవి, వెన్నెల ఇద్దరూ శివని ఇష్టపడతారు. శివ మాత్రం ఉమాదేవిని ప్రేమిస్తాడు. కూతురు ప్రేమ విషయం తెలుసుకున్న సీతారామరాజు ఏం చేశాడు ? ఎలాంటి నాటకానికి తెర తీశాడు ? శివ చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ? శివ ప్రాజెక్ట్ వాయు సక్సెస్ అయ్యిందా ? లేదా అనేది మిగతా కథ.

విలువలతో బతకడం కష్టం ఏమో కానీ అసాధ్యం కాదని భావించే ఓ కుర్రాడి కథ ఇది. పెళ్లి కొడుకు గెటప్ లో శివ ఓ అర్ధరాత్రి టాక్సీలో ప్రయాణిస్తూ..ట్యాక్సీ డ్రైవర్ సునీల్ కి తన గతం చెప్పుకోవడంతో ‘మిస్టర్ కింగ్’ కథ మొదలౌతుంతుంది. మురళి శర్మ ఎపిసోడ్, శివ ప్రాజెక్ట్ వాయు, ఉమాదేవి, వెన్నెల పాత్రల పరిచయాలు, ఇవన్నీ అంత ఆసక్తికరంగా లేకపోయినా.. అలా నడిచిపోతుంటాయి. ట్రైయాంగిల్ లవ్ స్టొరీని చాలా బలహీనంగా రాసుకున్నాడు దర్శకుడు. దీంతో ప్రేమ కథ అంత కనెక్టింగా వుండదు. పాత్రలు పరిచయమైన తర్వాత కథ మొదలవ్వాలి. కానీ మిస్టర్ కింగ్ లో అది జరగదు. ఇంటర్వెల్ బాంగ్ ముందు వచ్చే సన్నివేశం వరకూ అవసరం వున్నా లేకపోయినా హీరో పాత్ర గొప్పదనాన్ని మాటల్లో ఎలివేట్ చేసుకుంటూనే వెళ్ళాడు దర్శకుడు. చాలా సన్నివేశాలు హీరో క్యారెక్టర్ ఇంట్రోలానే వుంటాయి. వెన్నెల కిషోర్ పాత్ర రూపంలో కొంత కామెడీ ప్రయత్నించినప్పటికీ అవంత హిలేరియస్ గా వుండవు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యంగేజ్ మెంట్ సీక్వెన్స్ మరీ నాటకీయంగా వుంటుంది. ఆ డ్రామాని ప్రేక్షకుడికి కన్వెసింగా చెప్పడంలోదర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది.

విరామం తర్వాత మిస్టర్ కింగ్ పూర్తిగా సైడ్ ట్రాక్ పెట్టేస్తుంది. ఒక పాయింట్ తర్వాత అసలు ఈ కథని ఎటు తీసుకువెళ్తూన్నారో అర్ధం కాదు. కథని కాకుండా సమాజం పట్ల, పరిస్తితుల పట్ల తన అభిప్రాయాలని ఒకొక్క సీన్ గా వ్యక్తం చేసుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. పెళ్లి చూపులకు అబ్బాయి, అమ్మాయి ఇంటికి ఎందుకు రావాలి ? అమ్మాయి, అబ్బాయి ఇంటికి వెళ్ళకూడదా? బతకడానికి 35 వేల జీతం సరిపోదా ? రెండు లక్షల జీతం కావాలా? ప్రేమ కోసం ఎప్పుడూ అబ్బాయిలే పోరాటం చేయాలా ? అమ్మాయిలు చేయకూడదా? …. ఇలా బోలెడు ప్రశ్నలు వేసుకుంటూ ఒకొక్క ప్రశ్నకు ఒకొక్క సీన్ రాసుకుంటూ.. అసలు దర్శకుడు ఎత్తుకున్న పాయింట్ ఏమిటో ఏమి చెప్పదలచుకున్నాడో క్లారిటీ లేకుండా తీసుకుంటూ వెళ్ళాడు. ఒక పక్క ప్రాజెక్ట్ వాయు, మరోపక్క ట్రైయాంగిల్ లవ్ స్టొరీ, ఇంకో పక్క తండ్రి కూతుళ్ళ బంధం.. అన్నదమ్ముల అనుబంధం.. శివ ఆదర్శాలు.. ప్రేమ కోసం ఉమాదేవి ఆడిన చదరంగం.. ఇలా అనేక కోణాలని చొప్పించి.. కథని కలగాపులగం చేసేశాడు దర్శకుడు. దీంతో ఇందులో ఏ ఎమోషన్ కూడా బలంగా నిలబడలేకపోయింది.

శరణ్‌ కుమార్‌ చూడటానికి బావున్నాడు. స్క్రీన్ ప్రజన్స్ ఓకే. అయితే ఇంకా చాలా మెరుగవ్వాలి. చాలా చోట్ల క్లూలెస్ గా కనిపించాడు. దర్శకుడు ఆ పాత్రని మరీ డల్ గా తీర్చిదిద్దాడు. హీరోయిజం చూపించకూడదనేది దర్శకుడి భావన కావొచ్చు. కానీ ఇది కథానాయకుడి కథ అయినప్పుడు ఆ పాత్ర చుట్టూ ఒక ఆకర్షణ ఉండేలా తీర్చిదిద్దాలి. అలాంటి ఆకర్షణ ఇందులో కనిపించలేదు. ఫైట్లు, డ్యాన్సులు చేసే అవకాశం రాలేదు. యశ్విక అందంగా వుంది. క్లైమాక్స్ లో ఆమెకు ఒక కీలకమైన సన్నివేశమే దక్కింది. ఒక్క క్షణానికి ఈ సినిమాకి క్యీన్ అని టైటిల్ పెట్టాల్సిందనే భావన కూడా కలుగుతుంది. ఊర్వీ పాత్ర చలాకీగా వుంటుంది. అయితే ఆ పాత్రని దర్శకుడు ట్రీట్ చేసిన విధానం సహజంగా వుండదు. ఒక ట్విస్ట్ కోసమే ఉపయోగించుకున్న తప్పితే అ ట్విస్ట్ కూడా సహజంగా వుండదు. మ్యాథ్స్ ప్రొఫసర్ గా కనిపించిన తనికెళ్ళ భరణి.. మ్యాథ్స్ కంటే మోరల్ క్లాసులు ఎక్కువగా చెప్పారు. హీరో పాత్రని అవసరం వున్నా లేకపోయినా తన డైలాగులతో ఎలివేట్ చేసే పాత్రది. మురళి శర్మకు పెద్ద పాత్రే దక్కింది. తన పాత్ర వరకూ చాలా సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్లారు. సునీల్ కథని వినే పాత్రలో కనిపించారు. ఒక పాటకు డ్యాన్స్ కూడా వేశారు. వెన్నెల కిశోర్ ట్రాక్ జస్ట్ ఓకే. శివ తండ్రి పాత్రలో చేసిన రాజ్ కుమార్ స్క్రీన్ ప్రజన్స్ బావుంది. కాంచి ఓ రెండు సీన్లలో కనిపించారు. మిగతా నటులు పరిధిమేర చేశారు.

మణిశర్మ పాటలు మిస్టర్ కింగ్ కి ప్రధాన ఆకర్షణ. మంచి హుషారు తెప్పించే పాటలు ఇచ్చారు. అయితే ప్లేస్ మెంట్స్ కుదరలేదు. నేపధ్య సంగీతం బావుంది కానీ సరైన సీన్లు పడలేదు. కెమరాపనితనం బావుంది. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. దర్శకుడిలో మంచి డైలాగ్ రైటర్ వున్నాడు. ‘ఎక్కువ సంపాదిస్తున్నాడని పిల్లని ఇవ్వడం, ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడని రాజకీయ నాయకుడికి ఓటు వేయడం.. రెండూ ఒకటే’’ అనే డైలాగు పేలింది. మిస్టర్ కింగ్ అనే ఒక పాత్రని రాసుకొని దాని చుట్టూ కథని నడపాలనేది దర్శకుడి ఆలోచన. అయితే ఆ పాత్ర చుట్టూ ఉపకథలు ఎక్కువైపోయాయి. దీంతో కోర్ ఎమోషన్ మిస్ అయ్యింది. ఎక్కువ పాయింట్లు చెప్పెయాలనే తాపత్రయంలో ఏ ఒక్క పాయింట్ బలంగా చెప్పలేకపోయాడు మిస్టర్ కింగ్.

తెలుగు360 రేటింగ్ 1.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

50 డేస్ : మిన్నంటుతున్న యువగళం !

యువగళం పాదయాత్ర యాభై రోజులయింది. కుప్పం నుంచి ప్రారంభించి పుట్టపర్తి నియోజకవర్గం వరకూ వచ్చారు. ఈ యాభై రోజుల్లోనే అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పట్టభద్రులు టీడీపీ వైపు ఉన్నట్లుగా తేలింది....

ఆర్కే పలుకు : ఈ వారం ఉచిత సలహాలు!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాల తర్వాత ఇక ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏం రాస్తారోనని.. ఆయన మాటలకు హద్దులు ఉండవని అంచనాలు పెంచేసుకున్న వారికి ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే...

తిరుమలలో కూడా గంజాయి – ఇదీ ఏపీ పరిస్థితి !

తిరుమలలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడం అక్కడ పెద్ద ఎత్తున దందా జరుగుతోందని పోలీసులు గుర్తించడంతో శ్రీవారి భక్తులు నివ్వెర పోతున్నారు. ఎంతో పవిత్రంగా...

మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకా వీడియోలు ఉన్నాయా?

మంచు ఇంట్లో... అన్నాద‌మ్ముల గొడ‌వ‌తో కాక పుట్టిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌నోజ్ ఓ వీడియో విడుద‌ల చేయ‌డంతో... విష్ణుతో త‌న‌కున్న విబేధాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శుక్ర‌వారం అంతా ఇదే హాట్ టాపిక్‌....

HOT NEWS

css.php
[X] Close
[X] Close