అనిల్ రావిపూడి సూపర్ ఫామ్ లో వున్నాడు. చిరంజీవితో సినిమా కోసం ఏళ్లతరబడి కథలు రాసుకొని ఎదురుచూసే దర్శకులు వున్నారు. కానీ అనిల్ సింగిల్ సిట్టింగ్ లో ఐడియా ఓకే చేసుకున్నారు. 25 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశారు. అదే ‘మన శంకర వర ప్రసాద్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్ బావున్నాయి. ఆడియన్స్ వింటేజ్ చిరుని చుశామని అభినందిస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం చిరంజీవికి ఇచ్చారు అనిల్ రావిపూడి.
’25 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశాను. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కొన్ని దశాబ్దాలుగా ఎలా అలరించారో అవన్నీ కలుపుకుంటూ వెళ్లాను. అందుకే స్క్రిప్టు అంత ఫాస్ట్ గా ఫినిష్ అయ్యింది. ఇందులో ప్రతి సీన్ ఆయనదే. ఆయన స్టయిలే మళ్ళీ ఈ జనరేషన్ కి చూపించాను. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం ఆయననే దక్కుతుంది’అన్నారు అనిల్.
నిజమే.. ప్రతి దర్శకుడు చిరంజీవితో గొప్ప హీరోయిజం వున్న సినిమా చేయాలని అనుకుంటారు. కానీ అనిల్ అసలు ఆ జోలికి వెళ్ళలేదు. చిరంజీవి అనే ఇమేజ్ లోనే అద్భుతమైన హీరోయిజం వుంది. దాన్ని సరిగ్గా పట్టుకున్నాడు అనిల్. అది భలే పేలింది. ఏదేమైనా చిరంజీవి సినిమాకి 25 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేసిన దర్శకుడిగా అనిల్ పేరు గుర్తిండిపోతుంది. అలాగే ఒక పెద్ద స్టార్ బలాన్ని ఎలా వాడుకోవాలో అనే విషయంలో అనిల్ ని చూసి చాలా నేర్చుకోవచ్చు.
