పాపం సోము..! ముద్రగడ కూడా చేతులు ఖాళీ లేవన్నారు..!?

ఏపీ బీజేపీలోకి నేతల్ని ఆకర్షించడానికి సోము వీర్రాజు తీసుకెళ్తున్న ఆయస్కాంతానికి అంత పెద్ద ఆకర్షణ ఉండటం లేదు. చివరికి ముద్రగడ పద్మనాభం కూడా.. పార్టీలోకి వస్తానని చెప్పలేదు. ఆలోచించుకుని చెబుతా… చేతులు ఖాళీలేవని చెప్పి పంపేశారు. సోము వీర్రాజు.. రెండు రోజుల నుంచి తాను ముద్రగడ పద్మనాభాన్ని కలవబోతున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బహుశా.. ఆయన పార్టీలో చేరడానికి అంగీకరించి ఉంటారు.. అందుకే ఇలా ప్రచారం చేసుకుంటున్నారని అనుకున్నారు. తీరా ఉదయమే ఆయనను కలిసిన తర్వాత సోము వీర్రాజు బయటకు వచ్చి.. ముద్రగడ ఆలోచించుకుని చెబుతాననన్నాని నిరాశగా చెప్పుకొచ్చారు. అయితే.. పైకి ఆయన ఆలోచించుకుని చెబుతానన్నప్పటికీ.. బీజేపీలో చేరే ఉద్దేశం లేదని చెప్పినట్లుగా ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.

అయితే ఆయన సేవలు పార్టీకి చాలా ఉపయోగపడతాయని.. ఆయన చేరుతారన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. ఆయన కుమారుడు ప్రభుత్వ పరంగా కొన్ని పనులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మళ్లీ బీజేపీలో చేరి.. కొత్తగా రాజకీయం చేయాలని అనుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. సోము వీర్రాజు తనను కలుస్తానని కబురు పంపినప్పుడు.. తనకు పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెబితే..సోము కూడా సైలెంటయ్యేవారు.

అయితే కలవొచ్చు అని చెబితే సానుకూలత వస్తుందని అనుకుంటారు. అలాంటిదేమీ లేకపోవడంతో సోము వీర్రాజుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. చెన్నై వెళ్లి తెలుగులో సినిమాలు చేసిన పరభాషా నటీమణుల్ని కలిసి వచ్చినా అదే పరిస్థితి. ఇక్కడ పెద్దగా క్రియాశీలకంగా లేని నేతల్ని కలిసినా ఆదే స్పందన వస్తూండటంతో.. సోము వీర్రాజు దగ్గర ఆకర్ష్ తగ్గ అయస్కాంతం లేదన్న చర్చ ఆ పార్టీ నేతల్లో కూడా ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close