ముఖేష్ అంబానీ… టాప్ టెన్‌లో లేరు..!

ప్రపంచ కుబేరుల సంపద… కరోనా దెబ్బకు కరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా పేరు పొందిన వారి ఆస్తులు.. కళ్ల ముందే తగ్గిపోతున్నాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుడు.. ప్రపంచంలో టాప్ టెన్‌ కుబేరుల్లో ఒకరిగా కిరీటం దక్కించుకున్న ముకేష్ అంబానీకి ఇప్పుడు.. ఆ హోదా లేదు. కరోనా కారణంగా కరిపోతున్న ఆర్థిక వ్యవస్థలు.. స్టాక్ మార్కెట్ల కారణంగా..ఆయన సంపద… తగ్గిపోయింది. గత నెల వారాల కాలంలో ఆయన రూ. లక్షా నలభై వేల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో ఆయన స్థానం ప్రపంచ కుబేరుల జాబితాలో 9 నుంచి పదిహేడో జాబితాకు చేరింది. ప్రస్తుతం ఆయనకు రూ. మూడునన్నర లక్షల కోట్ల సంపద ఉండవచ్చని అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ హురూన్ అంచనా వేసింది.

అయితే.. దేశంలో ఆయన తిరుగులేని కుబేరునిగానే సాగుతున్నారు. ఎందుకంటే.. ఆయనతో పోటీగా ఉన్న బిజినెస్ కింగ్‌ల వ్యాపారాలు కూడా తగ్గిపోయాయి. నిజం చెప్పాలంటే.. అంబానీ కంటే ఎక్కువ నష్టపోయిన వాళ్లు ఉన్నారు. ఆదానీ గ్రూప్ ఓనర్ గౌతం అదానీ ముఖేష్ కన్నా ఎక్కువ సంపద పోగొట్టుకున్నారు. ఆయన సంపద 6 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. ఇక హెచ్‌సీఎల్‌ టెక్‌ శివ్‌ నాడార్‌ 5 బిలియన్‌ డాలర్లు, కోటక్ గ్రూప్‌నకు చెందిన ఉదయ్‌ కోటక్‌ బిలియన్‌ డాలర్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్ సంపద మొత్తం యాభై శాతం వరకూ కరిగిపోయింది కాబట్టి.. వీరి సంపదంలో ఈ మాత్రం తేడా రావడం సహజమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే.. ఈ కుబేరులకు వచ్చిన ఈ నష్టంతో… వారికి పోయేదేమీ లేదు. ఈ సంపద కరిగిపోవడం పూర్తిగా స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. రేపు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారన్న విషయం బయటకు రాగానే.. ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా ఊపందుకుంటాయి. అదేజరిగితే.. ఈ కుబేరుల సంపద.. ఇప్పుడు కోల్పోయిన దాని కన్నా.. రెండింతలు పెరుగుతుంది. అయితే.. ఈ కరోనా వల్ల.. ఆయా సంస్థల వ్యాపార, ఆర్థిక వ్యవహారాలు దెబ్బతింటేనే కోలుకోవడం కష్టం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా !

భారత్‌ను చైనా కావాలనే కవ్విస్తోంది. అవసరం లేకపోయినా.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తతంగా మారుతోంది. యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా...

HOT NEWS

[X] Close
[X] Close