హైదరాబాద్ కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలికితే పెద్ద న్యూస్ అయిపోయింది. కానీ.. ముంబైలో ఓ చోట ఎకరం స్థలం దాదాపుగా ఎనిమిది వందల కోట్లు పలికిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలోని నారిమన్ పాయింట్లో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 4.16 ఎకరాల మిని కొనుగోలు చేసింది. ఈ డీల్ ధర రూ. 3,472 కోట్లు. ఈ లాండ్ పర్చేజ్ 2025లో ముంబైలో జరిగిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్‌లలో ఒకటి.
ఈ భూమిని RBI తన కొత్త ఆఫీస్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి ఉపయోగించాలని భావిస్తోంది. ముంబైలోని నారిమన్ పాయింట్ ప్రైమ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ . ఇది 1970ల నుంచి బిజినెస్ హబ్‌గా ఉంది. ఇక్కడ అందుబాటులో అతి పెద్ద భూమి ఇదొక్కటే. అయినా ఆర్బీఐ పెట్టిన ేటు మార్కెట్ రేట్ కంటే 50 శాతం ఎక్కువే. ఎకరానికి సుమారు రూ. 834 కోట్లు చెల్లించింది.
ఈ భూమిలో అంతకు ముందు రాజకీయ పార్టీల ఆఫీసులు ఉండేవి. 2017లో, మెట్రో లైన్-3 ప్రాజెక్ట్ కోసం ఖాళీ చేసి, MMRCLకు ట్రాన్స్ఫర్ చేశారు. MMRCL మొదట ఈ భూమిని లాంగ్-టర్మ్ లీజ్‌కు ఆక్షన్ చేయాలని ప్లాన్ చేసింది. జూలై 2024లో బిడ్స్ ఇన్వైట్ చేసి, రూ. 5,000 కోట్లు పైగా ఆశించింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. జనవరి 2025లో RBI డైరెక్ట్ పర్చేస్‌కు ఆసక్తి చూపడంతో ఆక్షన్ క్యాన్సల్ చేసి, గవర్నమెంట్-టు-గవర్నమెంట్ డీల్‌గా మార్చారు. ఈ డీల్ నుంచి వచ్చిన డబ్బు మెట్రో లైన్-3 ప్రాజెక్ట్ వర్క్స్ , రుణాలు తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తారు.