వైసీపీ ప్రభుత్వం చేసిన మరో తప్పును రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దింది. అలిపిరి వద్ద నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ భూ కేటాయింపులను రద్దు చేసింది. ఇప్పటికే ఈ హోటల్ నిర్మాణానికి పనులు కూడా ప్రారంభించారు. అయినా ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒబెరాయ్ గ్రూపునకు సర్ది చెప్పింది. అక్కడ హోటల్ కట్టడం వల్ల వివాదాలు ఎప్పటికీ ఉంటాయని విరమించుకోవాలని కోరింది. దానికి ఒబెరాయ్ గ్రూపు అంగీకరించింది.
అలిపిరి శ్రీవారి పాదాల చెంత సెవన్ స్టార్ హోటల్ కోసం అంటూ ఇరవై ఎకరాల భూమిని ఒబెరాయ్ గ్రూపునకు జగన్ సర్కార్ కేటాయించింది. అక్కడ ముంతాజ్ హోటల్ పేరుతో అనుబంధ సంస్థ ద్వారా ఒబెరాయ్ గ్రూపు హోటల్ నిర్మాణం చేపట్టింది. పునాదులు వేశారు. అయితే హోటల్ పేరు ముంతాజ్ అని పెట్టడం వివాదాస్పదమయింది. పైగా వైసీపీ ఒబెరాయ్ గ్రూపునకు కేటాయించిన స్థలం.. టీటీడీ ఓ ఆధ్యాత్మిక ప్రాజెక్టు కోసం అనుకున్న స్థలం. అందుకే ప్రభుత్వం ఇప్పటికే పెట్టుబడి పెట్టిన ఒబెరాయ్ గ్రూపుతో చర్చలు జరిపింది.
ఒబెరాయ్ గ్రూపునకు తిరుపతిలోనే మరో చోట.. స్థలం కేటాయించనున్నారు. ఇప్పటి వరకూ పెట్టిన పెట్టుబడిని నష్టం చేసుకుని ఒబెరాయ్ గ్రూపు ఇతర ప్రాంతంలో సెవన్ స్టార్ హోటల్ ను నిర్ణయించుకుంది. అప్పట్లో ఒబెరాయ్ గ్రూపునకు .. ఆ స్థలం కట్టబెట్టడంలో .. భూమన కరుణాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. తర్వాత ఆయనే .. అది టీడీపీ ప్రభుత్వమే కేటాయించినట్లుగా రాజకీయం చేశారు. ఇప్పుడు ఆ హోటల్ ను తరలించడం తమ ఘనతగా చెప్పుకుంటున్నారు.