బన్నీకి టచ్ లో మురగదాస్

మురుగదాస్ కి టాలీవుడ్ కలసిరాలేదు. ఇక్కడ నేరుగా చేసిన స్టాలిన్, స్పైడర్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచాయి. ఐతే తెలుగు హీరోలకు మురుగదాస్ పై నమ్మకం పోలేదు. గజని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చే సత్తా మురుగదాస్ లో వుంది. రామ్ చరణ్ తో గతంలో ఓ సినిమా కోసం చర్చలు జరిపారు మురుగదాస్. ఐతే అది వర్క్ అవుట్ కాలేదు. తాజా సమాచారం ఏమిటంటే.. అల్లు అర్జున్ తో మురుగదాస్ టచ్ లో వున్నారని తెలిసింది

అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ చేయాలి. ఆ తర్వాత ఎలాంటి సినిమా ఉండాలనే దానికి అల్లు అర్జున్ అప్పుడే ఒక క్లారిటీ వున్నారు. ఆమధ్య మురుగదాస్ అల్లు అర్జున్ తో కలసి ఓ కథ చెప్పారు. ఈ పాయింట్ అల్లు అర్జున్ కి నచ్చింది. దర్బార్ తర్వాత కొత్త సినిమా ఏదీ సెట్స్ పైకి తీసుకెళ్లలేదు మురుగదాస్. ప్రస్తుతం ఓ రెండు కథలపై వర్క్ చేస్తున్నారు, అందులో అల్లు అర్జున్ కథ కూడా వుందని తెలిసింది. పుష్ప 2 తర్వాత మురుగదాస్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో వుండబోతుందని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు...

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close