అమేజాన్‌లో నార‌ప్ప‌.. రిలీజ్ డేట్ ఫిక్స్‌

నారప్ప సినిమా ఓటీటీకి వెళ్లిపోయింద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లోనే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తార‌న్నారు. అయితే.. ఈ సినిమాని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తార‌ని, ఓటీటీ బేరం వెన‌క్కి తీసుకున్నార‌ని వార్త‌లొచ్చాయి. అయితే.. అవ‌న్నీ పుకార్ల‌ని తేలిపోయింది. నార‌ప్ప ఓటీటీకే ఫిక్స‌య్యింది. ఈనెల 20న అమేజాన్ లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శితం కానుంది.

త‌మిళ సూప‌ర్ హిట్ `అసుర‌న్‌`కి ఇది రీమేక్‌. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న‌ప్పుడే.. ఈ సినిమా ఓటీటీకి అని ఫిక్స‌యిపోయింది. వెంకీ న‌టించిన మ‌రో చిత్రం దృశ్య‌మ్ 2 కూడా ఓటీటీకే వెళ్ల‌బోతోంది. ఆ సినిమా కూడా తొలి కాపీ సిద్ధ‌మైపోయింది. త్వ‌ర‌లోనే… దృశ్య‌మ్ 2 ఓటీటీ ప్ర‌క‌ట‌న రాబోతోంది. ఓ అగ్ర క‌థానాయ‌కుడు న‌టించిన రెండు సినిమాలు వ‌రుస‌గా ఓటీటీకి వెళ్లిపోవ‌డం… ఇప్ప‌టి ట్రెండ్ కీ, నిర్మాత‌ల ఆలోచ‌న విధానానికీ అద్దం ప‌డుతోంది. అక్టోబ‌రు వ‌ర‌కూ.. నిర్మాత‌లు ఓపిక ప‌ట్టాల‌ని, ఓటీటీల‌కు సినిమాని అమ్మొద్ద‌ని థియేట‌ర్ య‌జ‌మానులు విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అంత‌కంటే ముందే.. `నార‌ప్ప‌`, `దృశ్య‌మ్ 2` ఓటీటీ బేరాలు ఫిక్స‌వ్వ‌డంతో త‌ప్ప‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లైగ‌ర్‌’లో అదిరిపోయే ఐటెమ్ సాంగ్‌.. మ‌రి ఎవ‌రితో?

పెద్ద సినిమా అంటే ఐటెమ్ గీతం మ‌స్ట్ అయిపోయింది. `పుష్ప‌` లో స‌మంత ఐటెమ్ గీతం ఎంత మైలేజ్ ఇచ్చిందో తెలిసిందే. సినిమాల‌కు అది అద‌నపు ఆక‌ర్ష‌ణ అయిపోతోంది. `లైగ‌ర్‌` కోసం కూడా...

తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా...

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్...

పెద్ద బ్యాన‌ర్ల చేతిలో ప‌డిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు

ఈమ‌ధ్య పెద్ద బ్యాన‌ర్లు చిన్న సినిమాల‌పై దృష్టి నిలిపాయి. `జాతిర‌త్నాలు`తో చిన్న‌సినిమాల వ‌ల్ల ఉన్న లాభాలేమిటో అశ్వ‌నీద‌త్ లాంటి అగ్ర నిర్మాత‌కు బాగా అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మ‌రో చిన్న సినిమాకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close