చ‌రిత్ర సృష్టించిన ‘నాటు..నాటు’ మ‌న‌కే ఆస్కార్‌!

తెలుగు పాట చ‌రిత్ర సృష్టించింది. ఆస్కార్ గెలుచుకొంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌లోని `నాటు.. నాటు` పాట‌కు ఆస్కార్ పుర‌స్కారం ద‌క్కేసింది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకొంది. ఈ విభాగంలో.. అప్లాజ్‌, లిఫ్ట్ మి అప్‌, దిస్ ఈజ్ ఏ లైఫ్‌, హోల్డ్ మై హ్యాండ్ పాట‌ల్ని అధిగ‌మించి…. నాటు.. నాటు ఆస్కార్ అందుకొంది. కీర‌వాణి స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌ను రాహుల్ సిప్లిజంగ్‌, కాల‌భైర‌వ ఆల‌పించిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బోస్‌రాసిన ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సైతం ద‌క్కించుకొంది. ఇప్పుడు ఏకంగా ఆస్కారే వ‌రించింది. నాటు నాటు పాట‌కు ఆస్కార్ ప్ర‌క‌టించిన వెంట‌నే… డాల్డీ స్టేడియం మొత్తం ఊగిపోయింది. ఈ పాట‌కు ఆస్కార్ వ‌స్తుంద‌ని భార‌తీయులే కాదు… హాలీవుడ్ కూడా న‌మ్మింది. ప్ర‌పంచంలో ఎక్క‌డ చూసినా.. నాటు నాటు పాట గురించే చ‌ర్చ జ‌రిగింది. దానికి తోడు… రాజ‌మౌళి టీమ్ కూడా ఈ పాట‌కి భారీ ఎత్తున ప్ర‌చారం క‌ల్పించారు. దేశం మొత్తం ఈ పాట‌కు అవార్డు రావాల‌ని కోరుకొంది. ఇప్పుడు అనుకొన్న‌ట్టే జ‌రిగింది. కోట్లాది ప్ర‌జ‌ల ఆశ‌, ఆకాంక్ష నెర‌వేరింది. నాటు నాటుకు పుర‌స్కారం ద‌క్కింది. ఇంత‌కంటే ఏం కావాలి…? ఈ ఖ్యాతి ద‌క్కించుకొన్న తొలి భార‌తీయ చిత్రం ఇదే. జ‌య‌హో… ఆర్‌.ఆర్‌.ఆర్‌, జ‌య‌హో రాజ‌మౌళి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close