‘ఇస్మార్ట్’ హీరోయిన్స్‌: నిధిని దాటేస్తున్న న‌భా న‌టేషా

పూరి త‌న సినిమాల్లో హీరోనే కాదు, హీరోయిన్ల‌నీ బ్ర‌హ్మాండంగా చూపిస్తాడు. `పోకిరి` త‌ర‌వాతే… ఇలియానా స్టార్ అయ్యింది. `అమ్మా నాన్న త‌మిళ అమ్మాయి`తో అసిన్ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఇద్ద‌రి భ‌విత‌వ్యాలు పూరి చేతులో ఉన్నాయి. వాళ్లే నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేషా. ఇస్మార్ట్ శంక‌ర్‌లో వీరిద్ద‌రే క‌థానాయిక‌లు. ఈ పాత్ర‌ల్ని ఈ సినిమాలో పూరి తీర్చిదిద్దిన విధానం మాస్‌ని బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుద‌ల‌య్యాయి. వాటిలో నిధి అగ‌ర్వాల్ ఓ రేంజులో క‌నిపిస్తోంది. ఇప్పుడు న‌భా స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూస్తుంటే.. నిధిని న‌భా దాటేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈసారి రెండు పాత్రల్నీ పూరి ఫుల్ గ్లామ‌రెస్‌గా, మాస్‌గా తీర్చిదిద్దాడ‌నిపిస్తోంది. ముఖ్యంగా న‌భా క్యారెక్ట‌ర్ ని అయితే పూరి కొత్త‌గా తీర్చిదిద్దాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ న‌భాని ఎవ్వ‌రూ చూపించనంత గ్లామ‌ర్‌గా చూపించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాతో మ‌రిన్ని అవ‌కాశాలు కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మనిపిస్తోంది. ఇప్ప‌టికే న‌భాకి కొత్త అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. ఇస్మార్ట్ శంక‌ర్‌తో – ఈ భామ రేంజ్ మారుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close