అఫీషియ‌ల్‌: నిఖిల్‌తో న‌భాన‌టేషా!

ఎట్ట‌కేల‌కు న‌భాన‌టేషాకు ఓ ఛాన్స్ దొరికింది. అది కూడా.. నిఖిల్ పాన్ ఇండియా సినిమాతో. నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘స్వ‌యంభూ’. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో న‌భాని క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. అంతేకాదు… ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేసింది. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన క‌ట్టూ, బొట్టూతో న‌భా లుక్ ఆక‌ట్టుకొనేలా ఉంది. ఈ చిత్రంలో న‌భాది చాలా శ‌క్తివంత‌మైన పాత్ర అని చిత్ర‌బృందం చెబుతోంది. ఫ‌స్ట్ లుక్‌లో అది ప్ర‌తిబింబిస్తోంది కూడా. పిక్స‌ల్ స్టూడియో ప‌తాకంపై భువ‌న్‌, శ్రీ‌క‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. న‌భా కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటోంది. కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్న ర‌వి బ‌స్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. నిఖిల్ కి ఇది 20వ సినిమా ఇది. కాబ‌ట్టి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిఖిల్ గెట‌ప్‌, క్యారెక్ట‌రైజేష‌న్ ఆక‌ట్టుకొనేలా ఉంటాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close