అర్ష‌ద్ వార్సి పిల్ల‌ల‌కు బొమ్మ‌లు పంపిస్తా: నాగ్ అశ్విన్‌

క‌ల్కిలో ప్ర‌భాస్ ని జోకర్‌గా చూపించార‌న్న అర్ష‌ద్ వార్సి కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అర్ష‌ద్ కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే… ప్ర‌భాస్ పేరెత్తాడ‌ని టాలీవుడ్ ధీటుగా స్పందిస్తోంది. నాని, శ‌ర్వానంద్, సుధీర్‌బాబు త‌దిత‌ర క‌థానాయ‌కులు డైరెక్ట్ గానే అర్ష‌ద్ వార్సీపై విమ‌ర్శ‌నా బాణాలు ఎక్కు పెట్టారు. ‘మా’ కూడా దీనిపై స్పందించింది. విమ‌ర్శించేట‌ప్పుడు ప‌దాలు కాస్త జాగ్ర‌త్త‌గా వాడాలంటూ అర్ష‌ద్ కు బుద్ధి చెప్పింది. ఇప్పుడు ఈ విష‌యంపై ‘క‌ల్కి’ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఎక్స్ ఖాతాలో తాను చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.

చిత్ర‌సీమ‌ను వెన‌క్కి లాకెళ్లొద్ద‌ని, టాలీవుడ్ – బాలీవుడ్ అనే స‌రిహ‌ద్దులు చెరిగిపోయాయ‌ని, దేశం మొత్తం ‘సినిమా’ ఒక్క‌టే అని, ఆ దృష్టితోనే చిత్ర‌సీమ‌ని చూడాల‌ని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. అర్ష‌ద్ విమ‌ర్శ కాస్త హుందాగా ఉంటే బాగుండేద‌ని, ఆయ‌న ప‌దాల్ని మ‌రింత మెరుగ్గా ఉప‌యోగించాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ‘క‌ల్కి 2’ కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డ‌తాన‌ని, `క‌ల్కి 2`లో ప్ర‌భాస్ పాత్ర మ‌రింత గొప్ప‌గా, ఉన్న‌తంగా ఉంటుంద‌ని అభిమానుల‌కు మాట ఇచ్చాడు. అర్ష‌ద్ పిల్ల‌ల‌కు ‘బుజ్జి టాయ్స్ని’ పంపుతాన‌ని పేర్కొన‌డం కొస‌మెరుపు. ఒక‌రి విమ‌ర్శ‌ని నాగ్ అశ్విన్ హుందాగా తీసుకోవ‌డం, అర్ష‌ద్ పిల్ల‌ల‌కు బొమ్మ‌లు బ‌హుమ‌తిగా పంపిస్తాన‌ని చెప్ప‌డం.. నాగ్ అశ్విన్‌పై మ‌రింత గౌర‌వాన్ని క‌లిగిస్తున్నాయి. ఈ వివాదాన్ని నాగ్ అశ్విన్ పుల్ స్టాప్ పెట్ట‌డానికే చూస్తున్నాడు. మ‌రోవైపు బాలీవుడ్ కూడా అర్ష‌ద్ వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్థించ‌లేక‌పోతోంది. తోటి న‌టుడ్ని విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని అర్ష‌ద్‌కు హిత‌వు ప‌లుకుతోంది. అర్ష‌ద్ అనే కాదు, టాలీవుడ్ – బాలీవుడ్ అంటూ విడ‌గొట్టి మాట్లాడేవాళ్ల‌కు, ప్రాంతీయ సినిమాను చిన్న చూపు చూసేవాళ్ల‌కు గ‌ట్టిగా బుద్ది చెప్పాల్సిందే. అప్పుడు గానీ ఈ వివ‌క్ష త‌గ్గ‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టేకోవర్ చేస్తున్నారా?

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టెకోవర్ చేయబోతున్నారా? అరెస్టుకు ముందు క‌విత భుజానికెత్తుకున్న ఉద్య‌మాన్ని ఇక కేటీఆర్ న‌డ‌ప‌బోతున్నారా...? క‌వితను రాజ‌కీయంగా సైలెంట్ చేసే అవ‌కాశం ఉందా...? బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సర్కార్ పై...

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close