ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి… ఇలా మూడు సినిమాలతో తన మార్క్ ఏమిటో చూపించేశాడు నాగ అశ్విన్. ఇప్పుడు తన నుంచి ‘కల్కి 2’ రావాలి. అయితే ఈ గ్యాప్ లో నాగ అశ్విన్ గప్ చుప్ గా ఓ చిన్న సినిమా తీసేస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. `ఎవడే సుబ్రహ్మణ్యం` స్టైల్ లో.. ఓ చిన్న కథని, సెన్సిబుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం షూటింగ్ కూడా జరిగిపోతోందట. సినిమా పూర్తయిన తరవాతే వివరాలు వెల్లడించాలని భావిస్తున్నార్ట. చెన్నైలో షూటింగ్ జరుగుతోందని, అందరూ కొత్తవాళ్లే నటిస్తున్నారని సమాచారం అందుతోంది.
‘కల్కి 2’కి ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే ఈమధ్యలో ప్రభాస్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రాజాసాబ్’ పనులు ముగించాలి. దాంతో పాటుగా `ఫౌజీ` ఉంది. `స్పిరిట్` కూడా మొదలవ్వాల్సివుంది. ‘సలార్ 2’ పనులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అయిన తరవాతే.. `కల్కి 2` ఉంటుంది. స్క్రిప్టు విషయంలో కూడా నాగ అశ్విన్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. అన్ని రకాలుగా సంతృప్తి దొరికిన తరవాతే… ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకు? అని ఈ సినిమా మొదలెట్టి ఉండొచ్చు.


