ఈడీ ఆఫీసర్‌గా నాగ్‌?

నాగార్జున, ధ‌నుష్ క‌లిసి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్ రేపు.. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే ఖ‌రారు చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ముంబైలోని ‘ధారావి’ అనే మురికివాడ చాలా ఫేమ‌స్‌. ఆ ధారావిని అడ్డాగా చేసుకొన్న డాన్ క‌థ ఇద‌ని తెలుస్తోంది.

ఈ సినిమాలో నాగ్ పాత్ర ఏమిట‌న్న విష‌యంలో ఎలాంటి క్లూ ఇవ్వ‌లేదు. బ‌య‌ట మాత్రం నాగార్జున ఓ డాన్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అస‌లు విష‌యం ఏమిటంటే ఈ సినిమాలో నాగార్జున ఈడీ ఆఫీస‌ర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌)గా కనిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ 40 రోజులు కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. నాగ్ పై బ్యాంకాక్‌లో ఓ కీల‌క‌మైన షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది చిత్ర‌బృందం. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రేపు మిగిలిన వివ‌రాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి,.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

కన్నప్ప.. అంతా శివయ్య మహిమ

https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. నిమిషన్నర నిడివి గల టీజర్ లో యాక్షన్ ఘట్టాలకు పెద్దపీట వేశారు....

అందుకే.. వంగలపూడి అనితకు హోంశాఖ!

ఏపీలో అత్యంత కీలకమైన హోంశాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా నేత వంగలపూడి అనితకు కేటాయించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ సభ్యులను కూడా కాదని అనితకు హోంశాఖను కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది....

విష్ణు క‌న్న‌ప్ప వెనుక కృష్ణంరాజు

రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'క‌న్న‌ప్ప‌'. త‌న సొంత బ్యాన‌ర్‌లో బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం కృష్ణంరాజుకు న‌టుడిగా, నిర్మాత‌గా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని ప్ర‌భాస్‌తో...

తీహార్‌ జైల్లో కవితను కలిసిన కేటీఆర్

తీహార్ జైల్లో ఉన్న కవితతో చాలా రోజుల తర్వాత కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆమె కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close