త‌ప్పులేదు… నాగ‌బాబు ఆక్రోశానికి అర్థం ఉంది

మెగా ఈవెంట్‌లో నాగబాబు కామెంట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్పుడు ఇండ్ర‌స్ట్రీ అంతా అదే హాట్ టాపిక్‌. అన్న‌య్య ఫంక్ష‌న్‌కి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు రాలేద‌న్న‌ది ప‌క్క‌కు వెళ్లిపోయింది. నాగ‌బాబు అంత ఘాటుగా ఎందుకు కామెంట్లు చేశాడు? దానికి వ‌చ్చిన రియాక్ష‌న్ ఏమిటి? అన్న‌దే అస‌లు సిస‌లు పాయింట్‌గా మారింది. నాగ‌బాబు ఆవేశంగా అక్కుప‌క్షి అన్న‌ది రాంగోపాల్ వ‌ర్మ‌నే అని, మూర్ఘుడు అంటూ బిరుదు ఇచ్చింది యండ‌మూరికే అన్న‌ది.. వాళ్ల‌కు కూడా అర్థ‌మైపోయింది. అందుకే అటు వ‌ర్మ‌, ఇటు యండ‌మూరి కూడా స్పందించారు. యండ‌మూరి కాస్త మ‌ర్యాద‌గా ‘నాగ‌బాబు ఆవేశ‌ప‌డ్డాడంతే’ అన్నాడు గానీ.. వ‌ర్మ మాత్రం తన‌దైన శైలిలో కౌంట‌ర్లు వేయ‌డం మొద‌లెట్టేశారు. వ‌ర్మ అచ్చంగా ఇలానే రియాక్ట్ అవుతాడ‌న్న‌ది అంద‌రూ ఊహించిన‌దే. అందులో కొత్తేం లేదు. అయితే నాగ‌బాబు ఇంతెందుకు ఆవేశ‌ప‌డ్డాడ‌న్న‌దే మెయిన్ పాయింట్‌. నాగ‌బాబు అన‌వ‌స‌రంగా కెలుక్కొన్నాడు అని కొంద‌రు అంటుంటే… అత‌ని ఆవేశానికి అర్థం ఉంద‌ని మ‌రి కొంత‌మంది మెగా ఫ్యాన్స్ వెన‌కేసుకొస్తున్నారు.

చిరు 150వ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఏదోలా దాన్ని టార్గెట్ చేస్తూనే వ‌స్తున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఆఖరికి బాల‌య్య సినిమాతో ముడిపెట్టి… పోలుస్తున్నాడు. చిరు సినిమా కంటే బాల‌య్య సినిమానే బాగుంద‌ని ప‌రోక్షంగా ఖైదీని చిన్న‌చూపు చూస్తున్నాడు. బ‌హుశా.. అదే నాగ‌బాబులో ఆవేశానికి పెట్రోల్ పోసిన‌ట్టుంది. యండ‌మూరి కూడా త‌క్కువ తినలేదు. ఓ సంద‌ర్భంలో చ‌ర‌ణ్‌కీ, దేవిశ్రీ ప్ర‌సాద్‌ని పోల్చే క్ర‌మంలో చ‌ర‌ణ్‌ని చాలా త‌క్కువ చేసి మాట్లాడాడు. మొహానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకొని వ‌చ్చాడ‌ని, తండ్రి పేరు చెప్పుకొనే ర‌కం అని గ‌ట్టిగానే చుర‌క‌లు అంటించాడు. చిరు ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు కూడా నోరు జారి.. ‘చిరు రాజ‌కీయాల‌కు ప‌నికి రాడు’ అనేశాడు. ఇదంతా నాగ‌బాబు, అండ్ మెగా ఫ్యామిలీ గ‌మ‌నిస్తూనే ఉంది. కానీ.. బ‌దులు చెప్పే అవ‌కాశం ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదంతే. వ‌ర్మ‌పై మాట‌ల‌తో దండ‌యాత్ర చేసిన నాగ‌బాబు, ప‌నిలో ప‌నిగా యండ‌మూరినీ క‌డిగి ప‌డేశాడు. యండ‌మూరి లౌక్యుడు. అందుకే… ‘నేనేం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు’ అంటూ క‌వరింగ్ ఇచ్చాడు. ఇలాంటివి వ‌ర్మ‌కు ఏమాత్రం తెలీదు. అందుకే… వార్ మొద‌లెట్టేశాడు. ఇక రేప‌టి నుంచి.. ట్వీట్ల పండ‌గే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పులివెందుల యూరేనియం ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!

కడప జిల్లా పులివెందుల సమీపంలో ఉన్న తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కంట్రోల్ చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు . యూరేనియం...

రెండు రోజుల్లోనే “కుట్ర కోణం” కనిపెట్టిన డీజీపీ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న...

ఎవరూ తగ్గరు.. మరి చర్చలెందుకు..!?

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా... వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం...

సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ...

HOT NEWS

[X] Close
[X] Close