జగన్ మంచోడంటున్న నాగబాబు..!

విక్రమార్కుడు సినిమాలో  ఓ సీన్ ఉంటుంది. ఓ పోలీస్ అధికారి భార్యను ఆ ఊరిలో అధికారం చెలాయించే పెద్ద మనిషి కొడుకు ఎత్తుకొచ్చి శారీరక కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు.  తన భార్య అక్కడే ఉందని తెలిసిన పోలీసు అధికారి ఇద్దరు పిల్లల్ని తీసుకు వచ్చి తన భార్య కనిపించడం లేదని.. వెదికి పెట్టాలని చేతులు పిసుక్కుంటూ వేడుకుంటాడు. ఆయన భార్య పైనే ఉంటుంది. కానీ చూడనట్లుగా ఉంటాడు. ఎందుకంటే.. చూసి ఎదిరించి.. ఆయన  భార్యను తీసుకెళ్లే దైర్యం లేదు. ఎలాగోలా ఒప్పించి తీసుకెళ్లడమే లేకపోతే.. ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. చివరికి మూడురోజుల తర్వాత పంపిస్తానంటే.. అది చాలు అనుకుంటూ వెళ్లిపోతాడు ఆ పోలీస్ ఆఫీసర్. అంతకు మించి ఏం చేయలేరు మరి. ఎందుకంటే భవిష్యత్ ముఖ్యం. 

ఇదంతా ఓ  సినిమా సీన్. కానీ రియల్‌గా ఆ పోలీస్ ఆఫీసర్ భార్య ప్లేస్‌లో ఓ సినిమా ఉందని అనుకుంటే అది వకీల్ సాబ్ అవుతుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రను నాగబాబు పోషిస్తున్నారు. కాస్త కటువుగా ఉన్నా ఇదే నిజం. ప్రస్తుత వివాదంపై ఆయన స్పందించిన విధం చూస్తే..  జరిగిందేదో జరిగిపోయింది.. జగన్మోహన్ రెడ్డిని పొగిడి.. రాబోయే సినిమాలకు అయినా కాస్త రిలాక్సేషన్ తెచ్చుకుందామన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ఓ వైపు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ వకీల్ సాబ్ సినిమా కలెక్షన్లు భారీగా ఉండకుండా.. నియంత్రిస్తున్నారని.. టిక్కెట్ రేట్లను తగ్గించేశారనేది బహిరంగరహస్యం. కానీ నాగబాబు మాత్రం పాపం.. జగన్మోహన్ రెడ్డికేమీ తెలియదని అంటున్నారు. ఆయన పరిపాలనా వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉంటే ..  ఈ జీవోలు వచ్చాయని సర్ది చెప్పుకుంటున్నారు. మీడియాతోనూ అదే చెబుతున్నారు. 

మామూలుగా అయితే నాగబాబు.. ఇతర అంశాల్లో బుస్సుమని లేస్తారు. సందర్భం ఉన్నా లేకపోయినా బాలకృష్ణ వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. వార్తల్లోకి వస్తూంటారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు… అయినదానికి.. కాని దానికి విమర్శలు చేసేవారు. కానీ అప్పట్లా ఇప్పటి ప్రభుత్వం .. ప్రజాస్వామికంగా విమర్శలు చేస్తున్నారు ..అది ప్రజాస్వామ్య హక్కు అనుకునే పరిస్థితి లేదు. అది కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అందుకే.. కంట్రోల్ చేసుకున్నారు. విమర్శలు చేసి రచ్చ చేసుకుంటే.. వచ్చే సినిమాలకూ అదే గతి పడుతుందని… పొగడ్తలు ప్రారంభించారు.  తర్వాత రాబోయే సినిమాలకు ఉత్తర్వులు సవరించుకుంటారని.. జగన్‌కు తెలియకుండా జరుగుతోందని..  ఆయన ఆశతో మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుత ప్రభుత్వం పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లను నియంత్రించాలన్న లక్ష్యంతో  జీవోలు తేవడం.. కోర్టుల్లో డివిజన్ బెంచ్‌కు సైతం వెళ్లి టిక్కెట్ రేట్లను పెంచకుండా చేసింది. తర్వాత వచ్చే సినిమాలకూ ఇదే పాటించాల్సి ఉంటుంది. లేకపోతే విమర్శలు వస్తాయి. అలాంటి పరిస్థితి రాకుండా వకీల్ సాబ్ కలెక్షన్లు పోయినవి మళ్లీ రావు కాబట్టి.. తర్వతా సినిమాలనైనా కాపాడుకుందామని…  తన క్యారెక్టర్ డైలాగ్స్‌లో మార్పులు చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close