అఖిల్ – శ్రియా రెడ్డిల పెళ్లి వెన్యూ ఫిక్స్ అయ్యింది. వీరిద్దరి పెళ్లి ఇటలీలో జరగబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు నిజమైంది. అఖిల్ పెళ్లి రోమ్‌లో జరుపుతున్నాం… అంటూ నాగచైతన్య కన్ఫామ్ చేశాడు. డిసెంబరు 9న అఖిల్ – శ్రియల నిశ్చితార్థం జరగబోతోంది. పెళ్లి మేలో ఉండొచ్చని చైతూ చెబుతున్నాడు. తమ్ముడు పెళ్లి ముందు జరిగి, మీది ఆలస్యంగా జరిగితే మీరేం ఫీల్ అవ్వడం లేదా? అని అడిగితే… ”లేదు.. నిజం చెప్పాలంటే హ్యాపీగా ఉంది. అందరి కళ్లూ తనపై ఉంటాయి.. నన్ను వదిలేస్తారు కదా” అంటున్నాడు. చైతూ తన పెళ్లి ఎలా చేసుకొంటాడో ఇంకా ప్లాన్ చేసుకోలేదట. ఇదే విషయం అడిగితే.. ”ఏమో ఇంకా తెలీదు. ఏం మాయ చేసావేలోలా చర్చిలో చేసుకొంటామేమో. ఆ తరవాత గుళ్లో కూడా చేసుకొంటామేమో..” అని నవ్వేస్తున్నాడు.
చైతూ ఆన్సర్ జోక్‌గా, సినిమాటిక్‌గా అనిపించినా… చైతూ ప్లాన్ మాత్రం అదే అని తెలుస్తోంది. చైతూ పెళ్లి ముందు చర్చ్‌లో, ఆ తరవాత గుళ్లోనే జరగబోతోందని సమాచారం. ఇదే విషయం ఇది వరకు తెలుగు 360.కామ్ స్పష్టం చేసింది. చైతూ మైండ్లోనూ అదే ఆలోచనలున్నాయట. ఇంట్లో పెళ్లివాతావరణం మొదలైపోయిందని, షాపింగులు చేసేసుకొంటున్నామని, అయితే ఇదంతా అఖిల్ పెళ్లి కోసమే అని, తమ పెళ్లి ప్లానింగ్‌లు ఇంకా మొదలెట్టలేదని చెబుతున్నాడు చైతూ. తను కథానాయకుడిగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో ఈవారమే విడుదల అవుతోంది. బుధవారం నుంచి చైతూ కొత్త సినిమా పట్టాలెక్కుతుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.