వెంకీమామ యాక్టింగ్‌లో చైతూకి నచ్చేదేంటి?

నాగచైతన్య… అక్కినేని వారసుడు! అంతేనా? దగ్గుబాటి వారసుడు కూడా! తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు అగ్ర కుటుంబాల వారసత్వం వున్న ఏకైక కథానాయకుడు నాగచైతన్యే. తండ్రి నుంచి అక్కినేని కుటుంబ వారసత్వం… తల్లి నుంచి దగ్గుబాటి వారసత్వం వచ్చాయి. తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేశ్‌…. ఇద్దరూ మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమను ఏలుతున్నవారే. నటనలో ఎవరికి వారే సాటి. తండ్రి నటన గురించి, అందం గురించి చైతూ చాలా సందర్భాల్లో చెప్పాడు. మేనమామ వెంకటేశ్‌ నటన గురించి ఈరోజు ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంలో చెప్పాడు. ‘వెంకీమామ యాక్టింగ్‌లో మీకు నచ్చిందేంటి?’ అని అడిగితే.. కామేడీ టైమింగ్‌ అని చెప్పాడు. ‘‘వెంకీ మామ చిత్రాల్లో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ నాకు బాగా ఇష్టం. ఐ లవ్‌ హిజ్‌ కామెడీ టైమింగ్‌’’ అని చెప్పాడు. కె.ఎస్‌. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వెంకటేశ్‌, నాగచైతన్య కలిసి నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది. లవ్‌, యాక్షన్‌, కామెడీ అంశాలతో ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చైతూ తెలిపాడు. ఆ సినిమాలో వెంకీ, చైతూ మామా అల్లుళ్లగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే...

శ్రీ‌దేవి జ‌పం చేస్తున్న సుధీర్ బాబు

ప‌లాస‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్‌. ఇప్పుడు సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చారం మొద‌లెట్టేశారు. గోలీసోడాలు చూపించి... `ఇవి మీకు గుర్తున్నాయా..` అంటూ...

దేశంలోనే ఫస్ట్..! ఏపీలో స్కూళ్లు తెరుస్తారంతే..!

కరోనా ఉరుముతోంది. సెకండ్ వేర్.. ధర్డ్ వేవ్ అంచనాలను నిపుణులు వేస్తున్నారు. ఈ సమయంలో దేశంలో ఎక్కడా స్కూళ్లు తెరిచే సాహసాన్ని ప్రభుత్వాలు చేయడం లేదు. కానీ రోజుకు మూడు వేల కేసుల...

HOT NEWS

[X] Close
[X] Close