చైతూతో ప్ర‌శాంత్ వ‌ర్మ‌..?

‘ఆ’ సినిమాతో ఆక‌ట్టుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. విమ‌ర్శ‌కుల నుంచి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. రాజ‌శేఖ‌ర్‌తో ప్ర‌స్తుతం `క‌ల్కి` చేస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. వాటిని టీజ‌ర్ మ‌రింత పెంచేసింది. టీజ‌ర్‌ని క‌ట్ చేసిన విధానం.. అంద‌రికీ న‌చ్చింది. ఈ సినిమాలో విష‌యం ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌య్యింది కూడా. అందుకే ఆ సినిమా విడుద‌ల‌కు ముందే.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌పై క‌ర్చీఫులు రెడీ చేసుకుంటున్నారు యంగ్ హీరోలు.

‘ఆ’ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన నాని… ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు. ‘అ’ స‌మ‌యంలోనే.. నానికి ఓ క‌థ వినిపించాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. అలా నానితో ఓ సినిమా ముందే ఫిక్స‌య్యాడు. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, శ‌ర్వానంద్ లాంటి యువ హీరోలు కూడా ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో ట‌చ్‌లోకి వెళ్తున్నార‌ట‌. మంచి క‌థ ఉంటే చెప్పు…. అంటున్నార్ట‌. మొత్తానికి `క‌ల్కి` త‌ర‌వాత త‌ప్ప‌కుండా ఓ యువ హీరోతో… క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com