ఇది చైతూ… ‘అల వైకుంఠ‌పురం’

‘అల వైకుంఠ‌పురములో’ హీరో – హీరోయిన్ల క్యారెక్ట‌ర్ల‌ని బాగా డిజైన్ చేశాడు త్రివిక్ర‌మ్‌. ఈ సినిమా విజ‌య‌వంతం అవ్వ‌డంలో వాళ్ల కెమిస్ట్రీ బాగా ఉప‌యోగ‌ప‌డింది. `మేడ‌మ్‌.. మేడ‌మంతే.. `అంటూ బ‌న్నీ – పూజా వెంట ప‌డ‌డం బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. హీరోయిన్ ని ఓ స్టార్ హీరో `మేడ‌మ్‌.. మేడ‌మ్‌`అంటూ వెంట ప‌డ‌డం ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చేశాయి. ఇదే థియ‌రీ.. `గీత గోవిందం`లోనూ క‌నిపించింది. అక్క‌డ కూడా.. హీరోపై, హీరోయిన్ దే అప్ప‌ర్ హ్యాండ్. `మేడ‌మ్… మేడ‌మ్‌` అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ… ర‌ష్మిక వెంట ప‌డ‌డం భ‌లే క్యూట్ గా అనిపించింది.

ఇప్పుడు ప‌ర‌శురామ్ మ‌ళ్లీ అదే ఫార్ములాలోకి వెళ్తున్నాడు. ఈసారి కూడా హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీపై గ‌ట్టిగా గురి పెట్టిన‌ట్టు స‌మాచారం. ప‌ర‌శురామ్ ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య కోసం ఓ క‌థ సిద్ధం చేశాడు. `నాగేశ్వ‌ర‌రావు` అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇది మిడిల్ క్లాస్ క‌థ‌. చైతూని మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించ‌బోతున్నాడు. అందుకు పూర్తి విభిన్నంగా… హీరోయిన్ ని గొప్పింటి బిడ్డ‌గా, ఓ కంపెనీ సీఈఓగా తీర్చిదిద్దాడ‌ట‌. అదే కంపెనీలో హీరోని ఉద్యోగిగా మార్చేశాడు. దాంతో ఇక్క‌డ కూడా `మేడ‌మ్.. మేడ‌మ్‌` అంటూ హీరోయిన్ వెంట ప‌డ‌డ‌మే.. రిపీట్ అవ్వ‌బోతోంది. కాక‌పోతే… హీరోయిన్ ఎవ‌రన్న‌ది ఇంకా తేల‌లేదు. ఓ స్టార్ హీరోయిన్‌ని తీసుకొస్తే త‌ప్ప‌… అల వైకుంఠ‌పురం, గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుంది. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌రో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిలో “కట్టిన గ్రాఫిక్స్” అద్దెక్కిస్తున్న జగన్ సర్కార్ !

అమరావతి భూముల్ని వేలం వేయడమే కాదు ఇప్పుడు అక్కడ కట్టిన భవనాలను కూడా అద్దెకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. సీఎం జగన్ ఆమోదించేశారు. అమరావతిలో...

ఏపీలో ధియేటర్లు మూతబడతాయా !?

ఆన్‌లైన్ టిక్కెట్లు, సినిమాల కలెక్షన్లను గుప్పిట పెట్టుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావట్లేదు. తమ ఆదాయాన్నంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి.. ప్రభుత్వం ఇచ్చే దాని కోసం వెయిట్ చేయడం కన్నా ...

ఏపీలో మోడీ బహిరంగసభ లేనట్లే !

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన బీజేపీ నేతలు.. ఓ బహిరంగసభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పది లక్షల మందిని సమీకరిస్తామని బీజేపీ నేతలు...

లక్ష మెజార్టీ రాలే.. లక్ష ఓట్లొచ్చాయ్ !

ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని తాపత్రయపడిన వైసీపీకి లక్ష ఓట్లే రావడంతో ఆ ఆశ నెరవేరలేదు. పోలింగ్ శాతం బాగా పడిపోవడంతో... పోలైన ఓట్లలో లక్ష వైసీపీకి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close