ముందు చైతూ… ఆ త‌ర‌వాత స‌మంత‌

ప‌ర‌శురామ్‌కి దాదాపుగా లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టే. నాగ‌చైత‌న్య – ప‌ర‌శురామ్ కాంబో దాదాపుగా ఖాయ‌మైపోయింది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించ‌నుంది. అయితే ప‌ర‌శురామ్ ఈ ఒక్క సినిమాతోనే స‌రిపెట్ట‌డం లేదు. అదే కాంపౌండ్‌లో మ‌రో సినిమాకీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈసారి స‌మంతతో. ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ ఉంది. దాన్ని స‌మంత‌తో తెర‌కెక్కించేందుకు ప్ర‌ణాళిక‌లు న‌డుస్తున్నాయి. చైతూ సినిమా పూర్త‌యిన వెంట‌నే, స‌మంత సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని ప‌ర‌శురామ్ భావిస్తున్నాడు. `గీత గోవిందం` త‌ర‌వాత ప‌ర‌శురామ్‌కి యేడాది పాటు గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు అలాంటి విరామాలు రాకుండా ఉండాల‌న్న‌ది ప‌ర‌శురామ్ ఆలోచ‌న‌.

నిజానికి `గీత గోవిందం` క‌థ‌ని నాగ‌చైత‌న్య – స‌మంత‌ల‌కే వినిపించాడ‌ట ప‌ర‌శురామ్‌. లైన్‌గా చెబుతున్న‌ప్పుడు ఆ క‌థ చైతూకి పెద్ద‌గా ఎక్క‌లేదు. అది కాస్త విజ‌య్ – ర‌ష్మిక‌ల చేతిలో ప‌డి సూప‌ర్ హిట్ అయ్యింది. అన‌వ‌స‌రంగా ఓ సూప‌ర్ హిట్ సినిమాని వ‌దులుకున్నం అన్న ఫీలింగ్ అటు చైతూకీ, ఇటు స‌మంత‌కీ ఉంది. అందుకే ప‌ర‌శురామ్ తో ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయ‌డానికి రెడీ అయిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా - ఎన్నో ఒడిదుడుకులు. 'నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా'...

HOT NEWS

[X] Close
[X] Close