వేస‌వి విడిదికి చై-స‌మంత‌

మ‌జిలీతో ఓ హిట్టు కొట్టేశారు నాగ‌చైత‌న్య‌, స‌మంత దంప‌తులు. ఈ సినిమా విజ‌యం వీరిద్ద‌రికీ చాలా ప్ర‌త్యేకం. మ‌రీ ముఖ్యంగా నాగ‌చైత‌న్య‌కు. వ‌రుస ప‌రాజ‌యాల‌కు మ‌జిలీ బ్రేక్ వేసిన‌ట్టైంది. దాంతో ఈ విజ‌యాన్ని ఇద్ద‌రూ సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌చ్చే నెల‌లో స‌మంత‌, చైత‌న్య క‌ల‌సి… ఓ హాలీడే ట్రిప్ వేయ‌బోతున్నారు. “ప్ర‌స్తుతం వెంకీమామ షూటింగ్ జ‌రుగుతోంది. దానికి కొంచెం బ్రేక్ ఇచ్చి.. మే రెండో వారంలో హాలీడే ట్రిప్‌కి వెళ్దామ‌నుకుంటున్నా” అన్నాడు చైతూ.

“మ‌జిలీ టైమ్‌లో చాలా ఒత్తిడికి లోన‌య్యాను. ఈ సినిమా హిట్టవుతుందా, లేదా? అంటూ టెన్ష‌న్ ప‌డ్డాను. ఎందుకంటే పెళ్ల‌య్యాక మేమిద్ద‌రం క‌ల‌సి న‌టించిన సినిమా ఇది. సెంటిమెంట్ ప‌రంగానూ ఈ హిట్టు మా ఇద్ద‌రికీ చాలా కీల‌కం. మ‌జిలీ, సూప‌ర్ డీల‌క్స్ సినిమాల్లో తీరిక లేకుండా గ‌డిపాను. అందుకే ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకోవ‌డం నాకు చాలా అవ‌స‌రం” అంటోంది స‌మంత‌. అక్కినేని కుటుంబానికి మాల్దీవులు ఫ్యామ‌స్ హాలిడే స్పాట్‌. ఏమాత్రం విరామం దొరికినా కుటుంబం మొత్తం అక్క‌డికే వెళ్తుంటారు. మ‌రి చై-స‌మంత కూడా ఈసారీ అక్క‌డికే వెళ్తారా? లేదంటే కొత్త‌గా ఏమైనా ప్లాన్ చేస్తారా? అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ్ల రాజకీయంతో తలసాని సెల్ఫ్ గోల్ చేసుకున్నారా..!?

హైదరాబాద్‌లో కట్టిన లక్షణ ఇళ్లు చూపిస్తానంటూ హడావుడి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్... గ్రేటర్‌లో లేని పక్క నియోజకవర్గాల్లో ఉన్న ఇళ్లను చూపించడానికి తీసుకెళ్లడంతో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం...

పెట్రోల్, డీజిల్‌పై మరో రూపాయి వడ్డించిన జగన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరోసారి పన్నులు వడ్డించింది. పెట్రోల్, డీజిల్‌పై మరో రూపాయి సెస్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీలో రోడ్ల పరిస్తితి దిగజారిపోయింది....

ఈఎస్ఐ స్కాం నిందితుడి నుంచి మంత్రి కుమారుడికి కారు గిఫ్ట్..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే స్వగ్రామంలో అంతర్రాష్ట్ర పేకాట క్లబ్.. దాంతో పాటు భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా.. ఈఎస్‌ఐ స్కాంలో నిందితుల నుంచి...

సీబీఐ విచారణ కావాలంటే పార్లమెంట్‌లో ధర్నాలెందుకు..!?

పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహాత్ముని విగ్రహం వద్ద వైసీపీకి ఉన్న పాతిక మంది ఎంపీలూ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వారి ప్లకార్డులపై మాత్రం భిన్నమైన నినాదాలున్నాయి. అమరావతి కుంభకోణంపై...

HOT NEWS

[X] Close
[X] Close