నాగ‌శౌర్య – ‘మూగ మ‌న‌సులు’?

పాత టైటిళ్ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఆల్ టైమ్ క్లాసిక్స్‌లో ఒక‌టిగా నిలిచిన `మూగ మ‌న‌సులు` టైటిల్‌ని మ‌రోసారి పోస్ట‌ర్‌పై చూసే అవ‌కాశం ద‌క్క‌బోతోంది. నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించ‌బోయే కొత్త చిత్రానికి `మూగ మ‌న‌సులు` అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వ‌ర్కింగ్ టైటిల్ గా `మూగ‌మ‌న‌సులు` అనుకుంటున్నారు. అక్టోబ‌రు నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. శౌర్య క‌థానాయ‌కుడిగా `అశ్వ‌ద్ధామ‌` సెట్స్ పై ఉంది. ఇది పూర్తికాగానే ఈ కొత్త సినిమా మొద‌లైపోతుంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com